Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
సమీక్ష : గలాట – రెండు గంటల టార్చర్..

galata విడుదల తేదీ : 25 ఏప్రిల్ 2014
123తెలుగు. కామ్ రేటింగ్ : 1/5
దర్శకత్వం : కృష్ణ
నిర్మాత :రాజేంద్రప్రసాద్ వర్మ
సంగీతం :సునీల్ కాశ్యప్
నటీనటులు: శ్రీ, హరిప్రియ, సాయి కుమార్..

‘ఈ రోజుల్లో’ సినిమాతో హీరోగా పరిచయమై హిట్ అందుకున్న శ్రీని ఆ తర్వాత వరుసగా తన సినిమాలతో బాక్స్ ఆఫీసు వద్ద దండయాత్ర చేస్తూనే ఉన్నాడు. కానీ సరైన హిట్ మాత్రం అందుకోలేదు. ఈ సారి ఎలాగన్నా హిట్ అందుకోవాలని ట్రై చేసిన శ్రీని చేసిన ప్రయత్నమే ‘గలాట’. కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో హరిప్రియ హీరోయిన్ గా నటించింది. రాజేంద్రప్రసాద్ వర్మ నిర్మించిన ఈ సినిమాకి సునీల్ కాశ్యప్ సంగీతం అందించాడు. శ్రీని చాలా రోజుల  నుంచి ఎదురు చూస్తున్న సక్సెస్ ఈ సినిమాతో వచ్చిందో? లేదో? ఇప్పుడు చూద్దాం..

కథ :

ఈ సినిమాకి కథ అంటూ ఏమీ లేదు. కానీ రెండు గంటలు చూపించిన దానిలో నుంచి ఓ కథ చెప్పడానికి ట్రై చేస్తాను. చిద్విలాస్ అలియాస్ చిట్టి(శ్రీని) ముంబైలో సెటిల్ అయిన ఓ డబ్బున్న తెలుగు కుర్రాడు. చిట్టి వీక్ నెస్ అమ్మాయిలు. కానీ చిట్టి భామ్మ మాత్రం అచ్చ తెలుగమ్మాయిని చూసి పెళ్లి చేయాలనుకుంటుంది. భామ్మ కోరిక మేరకు తెలుగమ్మాయిని వెతికి పెళ్లి చేసుకోవడం కోసం హైదరాబాద్ వస్తాడు.

అక్కడి నుంచి కట్ చేస్తే హోం మినిస్టర్ అయిన పెద్దిరెడ్డి(సాయి కుమార్)కి చెందిన సిరి ఫార్మాసిటికల్స్ వేస్టేజ్ ప్రోడక్ట్ తాగు నీరులో కలిసి 35 మంది చనిపోతారు. దాంతో ఆ ఫార్మా సిటికల్స్ కంపీనీపై ఎంక్వైరీ కమీషన్ లో భాగంగా సిన్సియర్ ఐఎఎస్ ఆఫీసర్ జయ చంద్రన్(బెనర్జీ) రంగంలోకి దిగుతాడు. కానీ పెద్ది రెడ్డి తనని కాపాడుకోవడానికి జయ చంద్రన్ కుమార్తెను కిడ్నాప్ చేస్తాడు. అదే తరుణంలో జయ చంద్రన్ అన్న కూతురైన ఆండాళ్(హరిప్రియ) – చిట్టి ప్రేమలో ఉంటాడు. జయ చంద్రన్ సమస్య తెలుసుకున్న చిట్టి ఏం చేసాడు? హోం మినిస్టర్ నుండి ఎలా జయ చంద్రన్ కుమార్తెను కాపాడాడు? అనేదే మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలో మెయిన్ ప్లస్ పాయింట్ అంటే సినిమా ఎండింగ్ టైటిల్స్ లో వచ్చే ఎందరో మహానుభావులు అనే పాట బ్యాక్ గ్రౌండ్ లో వస్తూ స్క్రీన్ పై చాలా మంది గొప్పవారి ఫోటోలు రావడం. హరిప్రియకి నటన పరంగా పెద్ద చాన్స్ లేకపోయినప్పటికీ, గ్లామర్ గా కనిపించడానికి అందాల ఆరబోతకి డైరెక్టర్ ఎక్కువ చాన్స్ ఇచ్చాడు. శ్రీ పెర్ఫార్మన్స్ ఎప్పటిలానే రొటీన్ గా ఉంది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకి మైనస్ పాయింట్స్ చాలా ఉన్నాయి.. ఒక్కొక్కటిగా చెప్తే డైరెక్టర్ అనుకున్న పాయింట్ లో గానీ, రాసుకున్న కథలో గానీ అస్సలు దమ్ము లేదు. అసలు అది కథే కాదు. ఈ సినిమా స్టొరీ కంటే ఈ మధ్య వస్తున్న కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో స్టోరీస్ సూపర్బ్ గా ఉంటున్నాయి. అలాంటి కథకి చాలా వీక్ స్క్రీన్ ప్లే తోడవడం మరో పెద్ద మైనస్. సినిమా మొదటి నుంచి చివరి దాకా చాలా బోరింగ్ గా, చాలా స్లోగా ఉంటుంది. ఈ మధ్య చాలా సినిమాల్లో అందరూ ట్రై చేస్తున్న విధంగానే ఈ సినిమాలో కూడా భూతు డైలాగ్స్ పెట్టడానికి ట్రై చేసాడు. కానీ ఒక్కటి కూడా వర్క్ అవుట్ అవ్వలేదు.

ఇక హీరో మొదటి సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చేసాం కదా అని దాదాపు అన్నీ అలాంటి సినిమాలే చేయడం వల్ల తన యాక్టింగ్ లో ఏ మాత్రం ఇంప్రూవ్ మెంట్ కనపడలేదు. సాయి కుమార్ లాంటి అద్భుతమైన నటున్ని పెట్టుకొని ఆయన్ని వాడుకోవడంలో డైరెక్టర్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ముఖ్యంగా హోం మినిస్టర్ ఇంటిలోకి ఎవరు పడితే వాళ్ళు రావడం, అలాగే ఒక దారినపోయేవాడు ఇంట్లోకి వచ్చి హోం మినిస్టర్ ని పట్టించడం అనే క్లైమాక్స్ కాన్సెప్ట్ లో అస్సలు లాజిక్ అనేదే లేదు. సినిమా అంతా ఒక ఎత్తైతే క్లైమాక్స్ ఎపిసోడ్ మాత్రమే ఒక ఎత్తు. అలాగే సినిమాలో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి.

నాకు తెలిసి ఈ మూడు నాలుగు సంవత్సరాల్లో ఇంత దారుణమైన ఇంటర్వెల్ బాంగ్, క్లైమాక్స్ ఎండ్ చూడలేదు. నాగబాబు ట్రాక్, అలీ ట్రాక్, చిరంజీవి అనే క్యారెక్టర్ ట్రాక్స్ కి అర్థం పర్ధం లేదు. సినిమానే చాలా చాలా స్లోగా సాగుతోంది అనుకుంటే మధ్య మధ్యలో వచ్చే పాటలు ఆడియన్స్ కి ఇంకా టార్చర్ చేస్తాయి. రీమిక్స్ చేసిన ఓల్డ్ కృష్ణ గారి పాట ‘నువ్వలా చూస్తుంటే’ కూడా వర్క్ అవుట్ అవ్వలేదు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో కూడా చెప్పుకోదగినవి ఏమీ లేవు కావున అన్ని డిపార్ట్ మెంట్స్ గురించి ఒక్కో మాటలో చెప్పేస్తా, సినిమాటోగ్రఫీ – జస్ట్ యావరేజ్, సునీల్ కశ్యప్ మ్యూజిక్ – సాంగ్స్ వీక్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంతకన్నా వీక్. ఎడిటింగ్ – చాలా చెత్తగా ఉంది. డైలాగ్స్ – భూతు లేదా ఉపయోగం లేని సొల్లు డైలాగ్స్. కథ – అసలు ఉంటేగా, స్క్రీన్ ప్లే – చాలా బోరింగ్, డైరెక్షన్ – బిలో యావరేజ్. డైరెక్టర్ ఎంచుకున్న కాన్సెప్ట్ నుంచి టేకింగ్ వరకూ అన్ని విషయాల్లోనూ పర్ఫెక్ట్ గా ఫెయిల్ అయ్యాడు.

తీర్పు :

టైటిల్ లో ఉన్న ‘గలాట’ సినిమాలో ఉన్న నటీనటుల చేత చేయించి ఉంటే బాగుండేది కానీ అది చేయించకపోవడంతో గలాట కాస్తా టార్చర్ అయ్యింది. సినిమాలో చూడటానికి ఇవి ఉన్నాయి అని చెప్పాలి అంటే అది ఒక్క హరిప్రియ గ్లామర్ మాత్రమే అని చెప్పాలి. కథ నుంచి టేకింగ్ వరకూ అన్నీ మైనస్ అయిన ఈ సినిమా చూడటం కంటే సింపుల్ గా స్కిప్ చేయడం చాలా మంచిది.

123తెలుగు. కామ్ రేటింగ్ : 1/5

123తెలుగు టీం


సంబంధిత సమాచారం :