విడుదల తేది :20 జనవరి 2012 |
123తెలుగు.కాం రేటింగ్: 2/5 |
దర్శకుడు : గోకుల్ చంద్ర |
నిర్మాత :ఆర్. బి. చౌదరి |
సంగిత డైరెక్టర్ :ప్రకాష్ నిక్కి |
తారాగణం : జీవ, శ్రియ, ప్రకాష్ రాజ్ |
జీవా మరియు శ్రియ జంటగా నటించిన చిత్రం ‘రౌద్రం’. తమిళ్లో ‘రౌతిరం’ పేరుతో విడుదలైన ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్ లో భారీగా విడుదల చేసారు. ఈ చిత్రాన్ని తెలుగులో ఎస్వీఆర్ మీడియా వారు విడుదల చేసారు. ఈ చిత్రం ఈరోజే విడుదలవగా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ:
శివ (జీవా) అన్యాయాన్ని సహించలేని యువకుడు. దానికోసం పోరాటం కూడా చేస్తాడు. ఇదంతా అతని తల్లితండ్రులకు (జయప్రకాశ్, లక్ష్మి) నచ్చదు. లా కాలేజీ స్టూడెంట్ అయిన ప్రియ (శ్రియ) ని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. ఆమె అసిస్టెంట్ కమీషనర్ పోలిస్ కూతురు. ఈ క్రమలో సిటీలో ఉన్న రెండు గ్యాంగ్ గొడవల్లో ఇరుక్కుంటాడు. ఒకటి కిట్టు (గణేష్ ఆచార్య) మరొకటి గౌరి గ్యాంగ్. ఈ గొడవల నుండి కుటుంబ సభ్యుల కోరిక మేరకు సిటీ వదిలి వెళ్ళిపోవాలని అనుకుంటాడు. అప్పుడు ఆ గంగ్స్ ఎమ్ తర్వాత ఎమ్ జరిగింది అనేది మిగతా చిత్ర కథ.
ప్లస్ పాయింట్స్:
జీవా మంచి నటుడు ఈ చిత్రంలో ఆయన పాత్రకు న్యాయం చేసాడు. సొసైటీ మీద అతను చూపించే కోపం కళ్ళలో చూపించాడు. డాన్సులు ఫైట్స్ కూడా బాగానే చేసాడు. శ్రియ ఈ సినిమాలో చాలా అందంగా ఉంది. తన పాత్ర పెద్దగా లేకపోయినప్పటికీ ఉన్నంతవరకు చాలా బాగా చేసింది. తండ్రిగా చేసిన జయప్రకాశ్ పరవాలేదనిపించాడు. ప్రకాష్ చిత్ర ప్రారంభంలో చిన్న అతిధి పాత్ర వేసారు. గూండాలుగా చేసిన కొందరు తమ అవతారంతో భయపెట్టారు. చిత్ర మొదటి భాగంలో కొంత కామెడీ ఉంది.
మైనస్ పాయింట్స్:
చిత్ర కథనం చాలా స్లో గా సాగుతూ సహనాన్ని పరీక్షిస్తుంది. డైరెక్షన్ కూడా సరిగా లేదు. మరియు స్క్రీన్ప్లే గందరగోలంగా ఉంది. డైరెక్టర్ ఈ సబ్జెక్ట్ కి ఏ మాత్రం న్యాయం చేయలేకపోయాడు. ఒక్క అంశం కూడా ఆసక్తి కలిగించకపోగా కొన్ని సన్నివేశాలితే చిరాకు తెప్పిస్తాయి. జీవాకి డబ్బింగ్ చెప్పిన వాయిస్ అస్సలు బాగా లేదు. పవర్ఫుల్ వాయిస్ అయితే బావుండేది. జీవా-శ్రేయల మధ్య రొమాంటిక్ ట్రాక్ కూడా సరిగా తీయలేకపోయాడు.
సాంకేతిక విభాగం:
బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అస్సలు బాలేదు. రీ రికార్డింగ్ కూడా బాగా లేదు. ఎడిటింగ్ అయితే చాలా జేర్క్స్ ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బానే ఉన్నప్పటికీ లైటింగ్ డల్ గా ఉంది.
తీర్పు:
ఈ సబ్జెక్ట్ మంచి డైరెక్టర్ తీసి ఉంటే బావుండేది. సినిమా మెల్లిగా సాగుతూ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తూ చిరాకు తెప్పిస్తుంది.
అనువాదం: అశోక్ రెడ్డి. ఎమ్
123తెలుగు.కాం రేటింగ్: 2/5