సమీక్ష : తను నేను – కూల్ అండ్ క్లాస్ లవ్ స్టొరీ

సమీక్ష : తను నేను – కూల్ అండ్ క్లాస్ లవ్ స్టొరీ

Published on Nov 29, 2015 3:00 AM IST
Thanu Nenu-movie-review

విడుదల తేదీ : 27 నవంబర్ 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

దర్శకత్వం : రామ్ మోహన్ పి

నిర్మాత : రామ్ మోహన్ – సురేష్ బాబు

సంగీతం : సన్నీ ఎంఆర్

నటీనటులు : సంతోష్ శోభన్, అవిక గోర్, రవిబాబు..

‘ఉయ్యాలా జంపాలా’ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన పి. రామ్ మోహన్ కి సాయి సుకుమార్ అనే రైటర్ చెప్పిన కథ నచ్చడంతో సినిమా చేయాలనుకున్నాడు. ఎవరూ ముందుకు రాకపోవడంతో రామ్ మోహన్ దర్శకుడిగా మారి డైరెక్టర్ శోభన్ తనయుడు, ‘గోల్కొండ హై స్కూల్’లో నటించిన సంతోష్ శోభన్ ని హీరోగా పరిచయం చేస్తూ చేసిన సినిమానే ఈ ‘తను – నేను’. లో బడ్జెట్ తో సత్ర హీరోల సపోర్ట్ తో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ లవ్ స్టొరీ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

ఎవరూ లేని మన హీరో కిరణ్(సంతోష్ శోభన్) ఓ కాల్ సెంటర్ కంపెనీలో పనిచేసుకుంటూ, మిగతా టైంలో తన ఫ్రెండ్స్ తో కలిసి హ్యాపీ గా ఎంజాయ్ చేస్తుంటాడు. కిరణ్ కి బెస్ట్ ఫ్రెండ్ నరేష్(అభిషేక్). ఒక రోజు బర్త్ డే పార్టీలో నరేష్ ఫ్రెండ్ అయిన కీర్తి(అవిక గోర్)ని చూసి ప్రేమలో పడతాడు కిరణ్. కానీ తను ఉండేది బెంగుళూరు కావడం వలన కిరణ్ తన ప్రేమని చెప్పేలోపే బెంగుళూరు వెళ్ళిపోతుంది. కట్ చేస్తే కొద్ది రోజులకి కీర్తి హైదరాబాద్ కి షిఫ్ట్ అవుతుంది. అప్పుడే నరేష్, కిరణ్, కీర్తి, కాస్ట్ ఫీలింగ్ శ్రీకాంత్(రోహిత్ వర్మ) కలిసి టూర్ ప్లాన్ చేస్తారు. ఈ టూర్ టైం లో కిరణ్ – కీర్తిలు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటారు..

ఇక్కడి వరకూ హ్యాపీగా సాగిన కథలో చిన్న ట్విస్ట్.. అదేమిటంటే కీర్తి ఫాదర్ అయిన బండిరెడ్డి సర్వేశ్వరరావు(రవిబాబు) చిన్నప్పటి నుంచే కీర్తి అమెరికాకి వెళ్లి అక్కడ సెటిల్ అవ్వాలని బ్రెయిన్ వాష్ చేసి ఉంటాడు. కానీ మన హీరోకి అమెరికా అన్నా, అమెరికాకి వెళ్ళాలి లేదా వెళ్ళిన వాళ్ళన్నా చిరాకు,కోపం. ఈ విషయం తెలిసాక కిరణ్ – కీర్తిల మధ్య పలు సమస్యలు వస్తాయి. ఆ సమస్యలేమిటి? కిరణ్ – కీర్తిల ప్రేమని విడగొట్టడానికి సర్వేశ్వరరావు ఏమేమి ప్లాంక్ హేసాడు? అసలు కిరణ్ కి అమెరికా అంటే ఎందుకంత కోపం? చివరకి కిరణ్ – కీర్తిలు కలిసారా లేదా అన్నదే మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిన కథ.

ప్లస్ పాయింట్స్ :

‘తను నేను’ అనే సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ లో చెప్పుకోవాల్సినవి రెండు.. మొదటిది సినిమా ఫస్ట్ హాఫ్ అయితే రెండవది హీరోగా పరిచయమైన సంతోష్ శోభన్ పెర్ఫార్మన్స్. ఇక వివరాల్లోకి వెళితే.. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైనింగ్ గా స్టార్ట్ అవుతుంది. అలాగే చాలా స్పీడ్ గా కూడా ముందుకు వెళ్తూ ఉంటుంది. అన్నీ ఇంత ఈజీగా జరిగిపోతాయా అనేది పక్కన పెడితే పాత్రలను పరిచయం చేస్తూ ఆ పాత్రలని ఎస్టాబ్లిష్ చేస్తూ చాలా బాగా మొదటి అర్ధ భాగాన్ని నడిపించారు. ఫస్ట్ హాఫ్ లో ఓ పగలబడి నవ్వుకునే సీన్ లు లేకపోయినా సినిమా మొదటి నుంచి ఇంటర్వల్ బ్లాక్ వరకూ ఓ క చిరునవ్వు మీ ముఖంపై కంటిన్యూగా ఉంటుంది. దానివలన సినిమాలోని పాత్రలకి మీరు కనెక్ట్ అయ్యి ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ లో వచ్చే రెస్టారెంట్ సీన్, ఆఫీస్ సీన్స్, అమెరికా అంటే హీరో చెప్పే వెటకారపు డైలాగ్స్ అందరినీ బాగా ఆకట్టుకుంటాయి.

ఇక హీరోగా చేసిన సంతోష్ శోభన్ గతంలో గోల్కొండ హైస్కూల్ అనే సినిమాలో నటించినా తను హీరోగా, తన భుజాల మీద నడిపించిన సినిమా ఇది. సంతోష్ హీరోగా మొదటి సినిమాతోనే డిస్టింక్షన్ లో మార్కులు కొట్టేసాడు. సినిమా అమోట్టాన్ని తానొక్కడే నడిపించాడు. సినిమాకి కావాల్సిన అన్ని హావ భావాలను బాగా పలికించాడు. అలాగే సంతోష్ వాయిస్ బాగుంది, అలాగే అతను వాయిస్ లో చూపిన మాడ్యులేషన్స్ ఇంకా బాగున్నాయి. అక్కడక్కడా నాని, రవితేజ, అవసరాల శ్రీనివాస్ లని సంతోష్ ఇమిటేట్ చేసిన ఫ్లేవర్ కూడా సినిమాలో కనిపిస్తుంది. హీరోయిన్ అవిక గోర్ తనకి ఇచ్చిన పాత్రలో అవసరమైన మేరకు హావ భావాలను పలికించి వెళ్ళిపోయింది. సంతోష్ ఫ్రెండ్ గా కనిపించిన అభిషేక్ మారోసారి తన కామెడీ టైమింగ్ తో అక్కడక్కడా నవ్విస్తూ వచ్చాడు. రోహిత్ వర్మ బలుపు ఎన్నారైగా బాగా చేసాడు. రవిబాబు, సత్య కృష్ణన్ లు తమ పాత్రల పరిదిమేర నటించారు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ గా చెప్పాల్సింది సెకండాఫ్.. సెకండాఫ్ లో ఎమోషనల్ కంటెంట్ చాలా ఉంది.. కానీ దానిని ఎక్కడా సీరియస్ గా చెప్పడానికి డైరెక్టర్ ప్రయత్నించలేదు. ప్రతి సీరియస్ ఇష్యూని చాలా కామిక్ గా చెప్పడానికే ఇష్టపడ్డాడు. ఎమోషనల్ గా ఉండాల్సిన చోట కూడా కామెడీ ఎందుకు పెట్టారు అన్నది దర్శకుడికే తెలియాల్సిన లాజిక్.!! ఇక పోతే సినిమాలో హీరోకి ఎందుకు అమెరికా అంటే అంత కోపం అన్న విషయమే సినిమాకి మెయిన్ ట్విస్ట్.. కానీ ఎందుకు అనే విషయాన్ని ఆడియన్స్ ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ లోనే గెస్ చేసేయ్యగలరు. కావున ఆ ట్విస్ట్ ఆడియన్స్ కి పెద్దగా కిక్ ఇవ్వదు. ఫస్ట్ హాఫ్ లో ఒక ఫ్రెష్ ఫ్లేవర్ ని చూపిస్తూ వచ్చిన డైరెక్టర్ సెకండాఫ్ ని పరమ రొటీన్ గా చేసెయ్యడం బాలేదు.

కథనం విషయంలో సెకండాఫ్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ముఖ్యంగా సంతోష్ – రవిబాబుకి మధ్య సీరియస్ గా మాటల యుద్ధం జరుగుతుంది, ఆ తర్వాతి సీన్ లో ఆ సీరియస్ నెస్, బాధ కనిపించాలి కానీ దాని గుడి పూజ సాయి కోటి అని కామెడీ చేసెయ్యడం చాలా సిల్లీగా అనిపిస్తుంది. అలాగే సినిమాకి మెయిన్ ఎమోషన్ అయిన క్లైమాక్స్ సీన్ లో హీరో ఫాదర్ అండ్ మదర్ లో మార్పు రావడానికి ఒక బలమైన కారణం చూపించలేదు. దాంతో చూసే ఆడియన్స్ ఎదో హ్యాపీ ఎండింగ్ ఇవ్వాలని ఇలా ముగించేసారని సరిపెట్టుకోవాలే తప్ప కంటెంట్ పరంగా కనెక్ట్ అయ్యేది ఉండదు. ఇకపోతే సెకండాఫ్ లో వచ్చే ఓ డ్యూయెట్ సాంగ్ సినిమాకి అవసరం లేదు. కథనం మరియు రవిబాబు పాత్రపై ఇంకాస్త వర్కౌట్ చేసి ఉంటే సెకండాఫ్ చాలా బెటర్ గా ఉండేది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం అంటే ముందుగా చెప్పాల్సింది.. ఈ సినిమా చాలా అంటే చాలా లో బడ్జెట్ తో తీసిన సినిమా కానీ విజువల్స్ పరంగా, మ్యూజిక్ పరంగా, కంటెంట్ క్వాలిటీ పరంగా మాత్రం ఓ మంచి బడ్జెట్ సినిమా చూసాం అనే ఫీలింగ్ కలుగుతుంది. సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఇచ్చిన రెండుమూడు లొకేషన్స్ ని బోర్ కొట్టకుండా, బ్యూటిఫుల్ గా చూపించాడు. ఆర్ట్ డైరెక్టర్ ఎస్ రవీందర్ వేసిన సింపుల్ హౌస్ సెట్స్ సినిమా కంటెంట్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. ఇక సన్నీ ఎంఆర్ పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ప్రధాన హైలైట్. చాలా సీన్స్ లో అతని మ్యూజిక్ వల్లే చాలా సీన్స్ కి లైఫ్ వచ్చింది. ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ సెకండాఫ్ పై ఇంకాస్త కేర్ తెస్సుకొని లాగ్ ఉన్న సీన్స్ ని కట్ చేసేయాల్సింది.

ఈ సినిమాకి కథ – స్క్రీన్ ప్లే – మాటలు.. ఈ మూడు విభాగలను రామ్ మోహన్ – సాయి సుకుమార్ కలిసి డీల్ చేసారు. స్టొరీ లైన్ ని పూర్తి కథగా రాసేటప్పుడు అనవసరమైన కామెడీ పెట్టుకోకుండా చూడాల్సింది, కథనం పరంగా సెకండాఫ్ ని ఇంకాస్త సస్పెన్స్ గా రాసుకోవాల్సింది. డైలాగ్స్ మాత్రం బాగున్నాయి. ఇకపోతే రామ్ మోహన్ నిర్మాతగా ఓ మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వగలిగాడు, కానీ దర్శకుడిగా మాత్రం యావరేజ్ అనిపించుకున్నాడు. ఆయన మిస్ అయిన ఒకే ఒక్క లాజిక్ ఆడియన్స్ కేవలం కామెడీకే కాదు ప్రత్ ఎమోషన్ కి కనెక్ట్ అవుతారు. కావున ప్రతి ఎమోషన్ లోనూ కామెడీ ఉండాల్సిన అవసరం లేదు.

తీర్పు :

సంతోష్ శోభన్ ని హీరోగా పరిచయం చేస్తూ, రామ్ మోహన్ దర్శకుడిగా పరిచయం అవుతూ చేసిన ‘తను నేను’ అనే సినిమా కూల్ అండ్ క్లాస్ లవ్ స్టొరీగా వచ్చిన సినిమా. యువతను ఆకట్టుకునే అంశాలు మొదటి అర్ధభాగంలో నిండుగా ఉండడం ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఎలాంటి హడావిడి లేకుండా అలా అలా సాగిపోయే ఈ ప్రేమకథని యువత బాగా ఎంజాయ్ చేస్తారనే చెప్పాలి. హీరోగా పరిచయం అయిన సంతోష్ శోభన్ పెర్ఫార్మన్స్, అవిక గోర్ ప్రెజన్స్, బాగానే వర్కౌట్ అయిన కామెడీ, ఫస్ట్ హాఫ్ సినిమాకి హెల్ప్ అయ్యే అంశాలు అయితే, సెకండాఫ్ ట్విస్ట్ లలో కిక్ లేకపోవడం, ఎమోషనల్ కంటెంట్ ని ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా తీయలేకపోవడం బిగ్గెస్ మైనస్ పాయింట్స్. ఓవరాల్ గా యువత మాత్రం చూడదగిన ప్రేమకథే ఈ ‘తను నేను’.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు