సమీక్ష : “వర్జిన్ స్టోరి” – కాన్సెప్ట్ బాగున్నా.. సినిమా కనెక్ట్ కాదు !

సమీక్ష : “వర్జిన్ స్టోరి” – కాన్సెప్ట్ బాగున్నా.. సినిమా కనెక్ట్ కాదు !

Published on Feb 19, 2022 3:01 AM IST
Virgin Story Review In Telugu

విడుదల తేదీ : ఫిబ్రవరి 18, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: విక్రమ్ సహిదేవ్, సౌమిక పాండ్యన్, రిషికా ఖన్నా, రఘు కుమార్ కారుమంచి, రాకెట్ రాఘవ, ఆర్.కె. అమ్మ

దర్శకత్వం : ప్రదీప్ బి.అట్లూరి

నిర్మాతలు: శిరీష లగడపాటి, శ్రీధర్ లగడపాటి

సంగీత దర్శకుడు: అచ్చు రాజమణి

సినిమాటోగ్రఫీ: అనీష్ తరుణ్ కుమార్

ఎడిటర్ : గ్యారీ బి హెచ్

లగడపాటి శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితుడు. ప్రదీప్ బి. అట్లూరి దర్శకత్వంలో ఆయన నటించిన కొత్త చిత్రం వర్జిన్ స్టోరీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది ఎలా ఉందో చూద్దాం.

 

కథ:

టీనేజర్ ప్రియాంషి (సౌమిక పాండియన్) తన ప్రియుడు చాలా కాలంగా తనను మోసం చేస్తున్నాడని తెలుసుకుంటుంది. బాధలో ఉన్న యువతి తన మాజీ లవర్ పై ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంటుంది మరియు తెలియని వ్యక్తి తో హుక్ అప్ చేయాలని నిర్ణయించు కుంటుంది. ఆమె కాలేజీ డ్రాప్ అవుట్ అయిన విక్రమ్ (విక్రమ్ సహిదేవ్)ని ఎంచుకుంటుంది. కానీ అతనొక అద్భుతమైన గ్రాఫిక్ డిజైనర్. వారిద్దరూ కలిసి వన్ నైట్ స్టాండ్ కోసం సురక్షితమైన స్థలం కోసం వెతుకుతారు, కానీ ప్రతిచోటా విఫలమవుతారు. వారు చివరకు హుక్ అప్ చేసారా? రాత్రి వారు ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? సమాధానాలు కావాలంటే, వెండి తెర పై సినిమా చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్:

విక్రమ్ సహిదేవ్ బాగా నటించాడు, కొన్ని సన్నివేశాలలో అతని నటన చూడటానికి చాలా బాగుంది. తన డ్యాన్స్ స్కిల్స్‌తోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హీరోయిన్ సౌమిక పాండియన్ విషయానికి వస్తే, ఆమె చాలా బాగుంది మరియు ఆమె నటన కూడా బాగుంది. స్నేహల్ కామత్ పాత్ర బాగుంది మరియు ఆమె తన బెస్ట్ ఇచ్చింది.

టీనేజర్ల ఆలోచనా విధానాన్ని దర్శకుడు వివిధ సందర్భాల్లో చాలా చక్కగా చూపించాడు. ప్రేమకు సంబంధించిన కొన్ని డైలాగులు బాగున్నాయి. టెక్నికల్ గా, ఈ చిత్రం గొప్ప నిర్మాణ విలువలను కలిగి ఉంది, వాటిని మీరు తెరపై చూడవచ్చు. పాటలు వినడానికి బాగున్నాయి.

 

మైనస్ పాయింట్స్:

ప్రమోషన్స్ సమయంలో, మేకర్స్ సినిమా కథ వర్జిన్ అని చెప్పారు మరియు ప్రేక్షకులు నిజమైన ప్రేమకు అర్ధాన్ని కనుగొనవచ్చని కూడా పేర్కొన్నారు. పాయింట్ పర్వాలేదు. కానీ, దర్శకుడు దానిని చక్కగా చెప్పడంలో విఫలమయ్యాడు. స్క్రిప్ట్‌ పై ఇంకాస్త వర్క్ చేసి ఉంటే వర్జిన్ స్టోరీ మంచి సినిమా అయ్యేది.

మరోవైపు, కామెడీ సన్నివేశాలు సరిగ్గా పని చేయలేదు. రన్‌టైమ్ సరిగ్గా ఉన్నప్పటికీ, సినిమా లో అనవసరమైన పాత్రలు మరియు వాటికి సంబంధించిన సన్నివేశాలతో నిండి ఉంది. కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి. కొన్ని పాత్రలు, వాటి చర్యలు వాస్తవికంగా ఉంటే వర్జిన్ స్టోరీ మంచి సినిమా అయ్యేది.

 

సాంకేతిక విభాగం:

మంచి పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించినందుకు సంగీత దర్శకుడు అచ్చు రాజమణి ను అభినందించాలి. అనీష్ తరుణ్ కుమార్ కెమెరా పనితనం పర్వాలేదు. ఖర్చు పెట్టిన పెద్ద మొత్తం వెండి తెర పై ప్రదర్శింప బడటం వలన నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. గ్యారీ బిహెచ్ ఎడిటింగ్ బాగుంది.

 

తీర్పు:

మొత్తానికి వర్జిన్ స్టోరీ ప్రేక్షకులకు తెలిసిన కథనే చెబుతుంది. హీరో మరియు హీరోయిన్ల పెర్ఫార్మెన్స్ మరియు అచ్చు సంగీతం మీరు చూడగలిగే సానుకూల అంశాలు. యువకులు ఈ చిత్రానికి కనెక్ట్ కావచ్చు. యువత కి సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఉండటం తో యూత్ కి కనెక్ట్ అవుతుంది. మీరు కొన్ని అనవసరమైన సన్నివేశాలను భరిస్తే, మీరు ఈ వారాంతంలో ఈ చిత్రాన్ని చూడవచ్చు.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

 

Click Here English Version

సంబంధిత సమాచారం

తాజా వార్తలు