మలయాళ సినీ పరిశ్రమ లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన “2018”

Published on May 22, 2023 9:03 pm IST

7 సంవత్సరాల తర్వాత, మలయాళ చిత్ర పరిశ్రమ ఇప్పుడు మరొక కొత్త ఆల్ టైమ్ రికార్డ్ మూవీ ను చూస్తోంది. ఇటీవల విడుదలైన సర్వైవల్ డ్రామా 2018, విడుదలైన 17 రోజుల్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా నిలిచింది. దీంతో ఈ సినిమా రికార్డ్ ను క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు, టోవినో థామస్ నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 137.60 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. మోహన్‌లాల్ యొక్క పులిమురుగన్ (రూ. 137.35 కోట్లు)ను అధిగమించి నంబర్ వన్ స్థానాన్ని పొందింది.

ఒక్క కేరళ రాష్ట్రంలోనే 2018 65.25 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి మరో రూ.8.40 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో, ఈ చిత్రం 7.72 మిలియన్ డాలర్లు (రూ. 63.95 కోట్లు) వసూలు చేసింది, ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 137.60 కోట్ల రూపాయలను వసూలు చేయడం జరిగింది. అయితే, 2018 ఇప్పటికీ కేరళలో టాప్ గ్రాసర్స్ జాబితాలో 4వ స్థానంలో ఉంది. ఈ చిత్రం పులిమురుగన్ (రూ. 78.50 కోట్లు), బాహుబలి 2 (రూ. 73 కోట్లు), కెజిఎఫ్ చాప్టర్ 2 (రూ. 68.50 కోట్లు) తర్వాతి స్థానంలో ఉంది.

రోజువారీ కలెక్షన్లను బట్టి చూస్తే, 2018 వచ్చే వారం చివరి నాటికి పైన పేర్కొన్న అన్ని సినిమాలను అధిగమించడం ఖాయం. 2018 కేరళ వరదల ఆధారంగా వందలాది మంది ప్రాణాలను బలిగొంది మరియు రాష్ట్రం మొత్తాన్ని స్తంభింపజేసింది. జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టోవినో థామస్, కుంచాకో బోబన్, ఆసిఫ్ అలీ, వినీత్ శ్రీనివాసన్, తన్వి రామ్, అపర్ణ మరియు లాల్ కీలక పాత్రలు పోషించారు. వేణు కున్నప్పిల్లి, సీకే పద్మ కుమార్, ఆంటో జోసెఫ్ నిర్మాతలు.

సంబంధిత సమాచారం :