‘ధురంధర్ 2’ ట్రైలర్ వచ్చేస్తోంది.. రికార్డుల వేటకు రణ్‌వీర్ రెడీ..!

Dhurandhar 2

గత ఏడాది వెయ్యి కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘ధురంధర్’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘ధురంధర్ : ది రివెంజ్’ (Dhurandhar 2) పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ఈ స్పై థ్రిల్లర్‌పై అంచనాలు భారీగా నెలకొన్నాయి.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ వేదికగా ఈ చిత్ర ట్రైలర్‌ను అత్యంత గ్రాండ్‌గా లాంచ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఫిబ్రవరి 3న విడుదలైన టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా, ఇప్పుడు అందరి కళ్లు ట్రైలర్ లాంచ్ డేట్‌పైనే ఉన్నాయి.

బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు గట్టి పోటీ ఎదురుకానుంది. కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ (Toxic) కూడా అదే రోజున విడుదల కానుండటంతో రణవీర్ vs యశ్ మధ్య బిగ్ ఫైట్ ఖాయం. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, సారా అర్జున్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ‘ధురంధర్ 2’ కేవలం సీక్వెల్ మాత్రమే కాకుండా, ఇండియన్ స్పై థ్రిల్లర్ సినిమాల్లోనే ఒక భారీ యాక్షన్ విజువల్ వండర్‌గా నిలుస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.

Exit mobile version