“ఆర్ఆర్ఆర్” సినిమాపై బాలీవుడ్ క్రిటిక్ ఏమన్నాడంటే?

Published on Mar 26, 2022 12:06 am IST

జూనియర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ మల్టీస్టారర్లుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం “ఆర్‌ఆర్‌ఆర్‌”. భారీ అంచనాలతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకుంది. అయితే అభిమానులు, ప్రేక్షకులు, సినీ తారలు అందరూ ఆర్ఆర్ఆర్ సినిమాపై పొగడ్తల వర్షం కురిపిస్తుంటే, ఓ బాలీవుడ్ క్రిటిక్ మాత్రం ఆర్ఆర్‌పై విమర్శలు గుప్పించాడు.

బాలీవుడ్‌ క్రిటిక్‌ కమాల్‌ ఆర్‌ ఖాన్‌ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆర్ఆర్ఆర్‌ సినిమా తలాతోక లేని సౌత్‌ మసాలా సినిమాగా అభివర్ణించాడు. సినిమా చూసినందుకు తన నాలెడ్జ్‌ జీరో అయ్యిందని, తప్పు చెప్పలేను.. కానీ దేశ వీరులను చెత్త సినిమాతో పోల్చడం నేరమని అన్నాడు. రూ.600 కోట్ల బడ్జెట్‌తో చెత్త సినిమా తీసిన రాజమౌళిని 6 నెలలు జైలులో పెట్టాలని కమల్‌ ఆర్ ఖాన్ విమర్శించాడు.

సంబంధిత సమాచారం :