‘సవ్యసాచి’ నుంచి లేటెస్ట్ అప్ డేట్ !

Published on Oct 24, 2018 2:00 am IST

చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య కథానాయకుడిగా, నిధి అగర్వాల్ కథానాయకిగా తెరకెక్కుతున్న చిత్రం ‘సవ్యసాచి’. ఈ చిత్రం ట్రైలర్ ను అక్టోబర్ 24న సాయంత్రం 3 గంటలకు విడుదల చేయబోతున్నామని చిత్రబృందం ఇటీవలే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ కూడా ఖారారు అయినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 27వ తేదీన హైదరాబాద్ లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.

వెన్నెల కిషోర్, సత్య, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో తమిళ నటుడు ఆర్.మాధవన్, మాజీ హీరోయిన్ భూమిక కూడా కీలకపాత్రల్లో నటిస్తుండటం విశేషం. బాహుబలి చిత్రానికి గ్రాఫిక్స్ ను అందించిన మకుట సంస్థనే ఈ చిత్రానికి కూడా గ్రాఫిక్స్ ను అందిస్తోంది. ప్రేమమ్ తరువాత చైతు, చందూ మొండేటిల కలయికలో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :

X
More