దేవదాస్ మొదటి రోజు వైజాగ్ వసూళ్లు !

Published on Sep 28, 2018 11:03 am IST

నాగార్జున , నాని కలిసి నటించిన మల్టీ స్టారర్ చిత్రం ‘దేవదాస్’ పాజిటివ్ టాక్ ను తెచ్చుకొని బాక్సాఫిస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టుకుంటుంది. నాగ్ , నాని ల కెమిస్ట్రీ ఈ చిత్రంలో హైలైట్ అయింది. ఇక మొదటి రోజు వైజాగ్ లో ఈచిత్రం రూ. 58లక్షల షేర్ ను రాబట్టింది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ చిత్రం రూ .26లక్షల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక ఈసినిమాకు వేరే చిత్రాలనుండి పోటిలేదు కాబట్టి ఈ మూడు రోజులు కూడా ఈచిత్రం మంచి వసూళ్లను రాబట్టుకోనుంది.

శ్రీ రామ్ ఆదిత్య తెరకెక్కించిన ఈ చిత్రంలో రష్మిక , ఆకాంక్ష సింగ్ లు కథానాయికలుగా నటించారు. మణి శర్మ సంగీతం అందించని ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ పతాకం ఫై అశ్వినీదత్ నిర్మించారు.

సంబంధిత సమాచారం :