‘పెద్ది’ రిలీజ్‌పై కన్ఫ్యూజన్.. దిల్ రాజు చెప్పిన మాట ఇదే..!

Dil raju

తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘గాయపడ్డ సింహం’ చిత్రాన్ని మే 1, 2026న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే, ఏప్రిల్ 30న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పెద్ది’ విడుదల కానుంది. ఒక భారీ సినిమాతో చిన్న సినిమా పోటీ పడటంపై నెటిజన్లలో ఆసక్తికర చర్చ మొదలవ్వగా, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు దీనిపై స్పష్టత ఇచ్చారు.

దిల్ రాజు మాట్లాడుతూ.. ‘గాయపడ్డ సింహం విడుదల తేదీ కొన్ని షరతులతో కూడుకున్నది. ఏప్రిల్ 30న ‘పెద్ది’ గ్రాండ్ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో, థియేటర్ల కేటాయింపు కష్టమవుతుంది. ఈ విషయాన్ని ముందే చిత్ర బృందానికి చెప్పాను. ఒకవేళ రామ్ చరణ్ సినిమా అనుకున్న సమయానికి వస్తే, మా సినిమాను వారం రోజుల పాటు వాయిదా వేయడానికి టీమ్ అంగీకరించింది’ అని తెలిపారు.

ప్రస్తుత కాలంలో ప్రమోషన్లు చాలా ముఖ్యం కాబట్టే ముందుగానే ఈ ప్రకటన చేశామని, ‘పెద్ది’ వాయిదా పడితేనే మే 1న తరుణ్ భాస్కర్ సినిమా వస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ ‘పెద్ది’ షెడ్యూల్ ప్రకారం విడుదల అయితే, ‘గాయపడ్డ సింహం’ వారం రోజుల తర్వాత థియేటర్లలోకి రానుంది. దీంతో అభిమానుల్లో ‘పెద్ది’ రిలీజ్‌పై కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. మరి ‘పెద్ది’ మేకర్స్ ఈ కన్ఫ్యూజన్‌ను దూరం చేస్తారేమో చూడాలి.

Exit mobile version