మరో మల్టీ స్టారర్ ను నిర్మించనున్న ప్రముఖ నిర్మాత !
Published on Jul 12, 2018 1:00 pm IST

ప్రస్తుతం తెలుగు లో మల్టీ స్టారర్ చిత్రాల హావ నడుస్తుంది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి గొప్ప మల్టీ స్టారర్ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రస్తుతం అగ్ర హీరో వెంకటేష్ , యువ హీరో వరుణ్ తేజ్ల తో కలిసి ‘ఎఫ్ 2’అనే మల్టీ స్టారర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం తో పాటు ఆయన మరో మల్టీ స్టారర్ ను నిర్మించడానికి సిద్ధమవుతున్నారు.

ఇటీవల ‘సమ్మోహనం’ చిత్రంతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్న దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్ర గంటి ఈ మల్టీ స్టారర్ ను తెరకెక్కించనున్నారు. మరి ఈ చిత్రంలో హీరోలు గా ఎవరు నటిస్తారో తెలియాలంటే కొద్దీ రోజులు ఆగాల్సిందే. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్ర వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook