చైనాలో చతికిలబడిన రజనీ ‘2 పాయింట్ 0’

Published on Sep 10, 2019 2:00 am IST

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘2 పాయింట్ 0’ ఇండియాలో భారీ అంచనాల నడుమ విడుదలై ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. సుమారు రూ.540 కోట్ల వ్యయంతో నిర్మితమైన ఈ సినిమా ఆ మొత్తాన్ని వెనక్కి రాబట్టలేకపోయింది. దీంతో నిర్మాతలు చాలా నష్టపోయారు.

ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి చైనాలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ అనుకున్న సమయానికి విడుదల చేయలేకపోయారు. సుమారు 10 నెలల తర్వాత గత శుక్రవారం సుమారు 47,000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. కానీ నిర్మాతల ఆశలు నీరుగారేలా కనిపిస్తున్నాయి. మొదటిరోజు 1 మిలియన్ వసూలు కాగా రెండు, మూడవ రోజుల్లో భారీగా తగ్గుముఖం పట్టాయి.

ట్రేడ్ లెక్కల మేరకు మూడు రోజులకు కలిపి 2.4 మిలియన్ల వరకు మాత్రమే వెనక్కు రాబట్టింది. రిలీజ్ ఖర్చులతో పోలిస్తే ఇది చాలా తక్కువని, ఇంకా పెద్ద మొత్తంలో వసూలు చేయాల్సి ఉందని తెలుస్తోంది. మరి ఫుల్ రన్ ముగిసేనాటికి పంపిణీదారులు ఎంతవరకు సేవ్ అవుతారో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More