టాక్..”రాధే శ్యామ్” కి అంత మొత్తంలో ఆఫర్ వచ్చిందా.?

Published on Jan 28, 2022 12:00 am IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం “రాధే శ్యామ్” కోసం అందరికీ తెలిసిందే. ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం పలు కారణాల చేత వాయిదా పడుతూ వస్తుంది.

మరి ఎలాగో ఈ జనవరి 14న రిలీజ్ చేసేయ్యాలని మేకర్స్ ఫిక్స్ కాగా కరోనా మూడో వేవ్ మళ్లీ దెబ్బెసింది. దీనితో కథ మళ్లీ ముందుకు వచ్చింది. ఇక ఇదిలా ఉండగా.. ఈ సినిమా రిలీజ్ ఓటిటి లో ఉంటుంది అని ఒక షాకింగ్ రూమర్ ఓ రేంజ్ లో స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ కాగా అసలు ఈ సినిమాకి ఫ్రెష్ గా ఎంత ఆఫర్ వచ్చిందో తెలుస్తుంది.

మరి ఈసారి రాధే శ్యామ్ కి ఏకంగా 500 కోట్లు ఆఫర్ ని ఓ దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ ఆఫర్ చేసిందట. అయినా కూడా మేకర్స్ అందుకు నో చెప్పి థియేటర్స్ లోనే ముందు రిలీజ్ కి ఫిక్స్ అయ్యారని తెలుస్తుంది. మరి ఈ కొత్త డేట్ ఎప్పుడు అనేది ఇంకా అనౌన్స్ కావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :