నాని ‘దసరా’ కోసం విలేజ్ సెట్.. 12 ఎకరాల్లో 12 కోట్లతో..!

Published on Jan 26, 2022 11:03 pm IST

న్యాచురల్ స్టార్ నాని హీరోగా ఇటీవల వచ్చిన ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రం మంచి విజయాన్ని అందుకుని పలువురు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలను అందుకుంది. ఇక నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో చేస్తున్న ‘అంటే.. సుందరానికీ’ ఇప్పటికే షూటింగ్‌ని పూర్తి చేసుకుంది. ఇక దీని తర్వాత నాని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ‘దసరా’ ప్రాజెక్ట్ చేస్తున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ పై ఉంది. ఈ సినిమాలో నాని
తెలంగాణ యాసలో మాట్లాడుతూ డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం హైదరాబాద్ శివారులో దాదాపు 12 ఎకరాల్లో 12 కోట్ల ఖర్చుతో ఒక విలేజ్ సెట్ ను నిర్మిస్తున్నారని సమాచారం. ఈ సెట్ కోసం ‘కడియం’ నుంచి పెద్ద ఎత్తున వివిధ రకాల మొక్కలను తెప్పిస్తున్నారని, ఈ సెట్‌లోనే ఎక్కువ భాగం సినిమా షూటింగ్ జరగనుందని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :