చరణ్ – శంకర్ సినిమాపై నెక్స్ట్ లెవెల్లో పెరిగిపోతున్న హైప్.!

Published on Jul 7, 2022 7:01 am IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఇండియాస్ మరో టాప్ అయినటువంటి శంకర్ తో భారీ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. చరణ్ మరియు శంకర్ కెరీర్ లలో ఇది 15వ సినిమా కాగా దీనిపై మరింత ఆసక్తి నెలకొంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాని శంకర్ తన మార్క్ లో రేంజ్ లో ప్లానింగ్స్ తో టేకప్ చేస్తుండగా ఇప్పుడు సినిమాపై కనిపిస్తున్న ఒకో అప్డేట్ మాత్రం మరిన్ని అంచనాలు పెంచుతూ వెళ్తుంది.

ఈ చిత్రంలో రామ్ చరణ్ లుక్స్ నుంచి అలాగే సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ పై వస్తున్న టాక్ తో అంతకంతకూ హైప్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది. శంకర్ కూడా తన మార్క్ సబ్జెక్టు మరియు భారీ బడ్జెట్ తో సాలిడ్ అవుట్ పుట్ ని రాబడుతున్నారని గట్టి టాక్ ఉంది. మరి ఇవన్నీ కరెక్ట్ గా సెట్టయ్యి శంకర్ కం బ్యాక్ ఇస్తే మాత్రం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మామూలుగా ఉండదని చెప్పాలి.

సంబంధిత సమాచారం :