జూ ఎన్టీఆర్ అంటే నాకు చాలా ఇష్టం అంటున్న ఎంపీ !

Published on Jul 29, 2018 3:19 pm IST

స్టార్ హీరో జూ ఎన్టీఆర్ ను ప్రేక్షకులే కాదు, ప్రముఖ వ్యక్తులు కూడా ఇష్టపడతారు. ముఖ్యంగా ఆయన నటనను, సన్నివేశంలో సందర్భానుసారంగా ఆయన ఇచ్చే హావాభావాలను, ప్రత్యేకించి అయన డాన్స్ ను ఇష్టపడిన వారు ఉండరంటే అతిశయాక్తి కాదు. తాజాగా తారాక్ అంటే తనకు ఎంతో ఇష్టమని తెలుగు దేశం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

ఇంటర్వ్యూలో ఆయన జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్తూ.. ‘జూనియర్‌ ఎన్టీఆర్‌ అంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా తను జీవితంలో ఎదిగిన క్రమం, ఓ హీరోగా కన్నా ఓ యాక్టర్ గా తను చూపించే ఎక్స్ ప్రెషన్స్, అలాగే తను డైలాగ్స్ చెప్పే విధానం, ప్రధానంగా తన మాడ్యులేషన్ అంటే నాకు చాలా ఇష్టం అని రామ్మోహన్ నాయుడు చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :