బోయపాటి నెవర్ బిఫోర్ కాంబోకు నిర్మాత ఆయనే.?

Published on Jun 15, 2021 11:02 pm IST

తన మాస్ చిత్రాలతో టాలీవుడ్ లో తనకంటూ సెపరేట్ క్రేజ్ ఏర్పర్చుకున్న మాస్ మసాలా దర్శకుడు బోయపాటి శ్రీను. తన ప్రతీ సినిమాకు కూడా సెపరేట్ మాస్ వేరియేషన్స్ తో ఆకట్టుకునే బోయపాటి నుంచి ఒక నెవర్ బిఫోర్ కాంబో సెట్టవ్వనుంది అని టాక్ ఉంది. అదే కోలీవుడ్ స్టార్ నటుడు సూర్యతో.. ఇప్పటి వరకు సూర్య అది ఇది అని లేకుండా అన్ని రోల్స్ లో కూడా అదరగొట్టేసాడు.

సింగం సిరీస్ లో తన మాస్ యాంగిల్ ని కూడా చూసాము. కానీ బోయపాటి లాంటి దర్శకునితో మాస్ సినిమా ఇంకా పడలేదు. అందుకే జస్ట్ బజ్ కే ఈ చిత్రంపై మంచి క్రేజ్ నెలకొంది. మరి ఈ క్రేజీ కాంబోను ఎవరు ప్రొడ్యూస్ చెయ్యనున్నారో ఇప్పుడు తెలుస్తుంది. ప్రస్తుత టాలీవుడ్ మోస్ట్ హ్యపెంగ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నే ఈ చిత్రాన్ని కూడా టేకప్ చేయనున్నట్టు తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక సమాచారం ఇంకా రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :