పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాబోతున్న భారీ అంచనాలు ఉన్న సినిమా ‘స్పిరిట్’. కాగా ఈ సినిమా రెగ్యులర్ పోలీస్ యాక్షన్ డ్రామాలా కాకుండా, వైల్డ్ నేచర్ ఉన్న ఓ మాజీ పోలీస్ పతనం – పోరాటం చుట్టూ నడిచే డార్క్ డ్రామాగా ఈ సినిమా రాబోతుంది. గతంలో ఇదే పాయింట్ మీద గోపీచంద్ ‘గోలీమార్’ సినిమా వచ్చింది. ఐతే, హీరో పోలీస్ నుంచి డాన్ గా మారినా.. స్పిరిట్ ట్రీట్మెంట్ చాలా కొత్తగా ఉంటుందట. పవర్ఫుల్ క్రైమ్ సిండికేట్‌ను ఎదుర్కొనే క్రమంలో హీరోలోని కోపం, మానసిక సంఘర్షణ ప్రధాన అంశాలుగా ఈ సినిమా ఉంటుందట.
ముఖ్యంగా ‘పోలీస్ వర్సెస్ క్రిమినల్స్’ కంటే, ఒక వ్యక్తి తనను తాను ఎలా తిరిగి నిలబెట్టుకున్నాడనే క్యారెక్టర్ డ్రామా కొత్త కోణంలో సాగుతుందట. కాగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో త్రుప్తి దిమ్రిని హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ లో ప్రభాస్ పక్కా వైల్డ్ అండ్ మాస్ అవతార్ లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రాన్ని టి-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మించనున్నాయి. మొత్తానికి ‘స్పిరిట్’ పై ఫ్యాన్స్ భారీ హోప్స్ పెట్టుకున్నారు.
