కరోనా వైరస్ మహమ్మారి కారణం గా గతేడాది కీర్తీ సురేష్ నటించిన రెండు సినిమాలు పెంగ్విన్ మరియు మిస్ ఇండియా సినిమాలు థియేట్రికల్ విడుదల ను దాటి వేశాయి. ఈ రెండు సినిమాలు కూడా ఒకటి ప్రైమ్ టైమ్ లో విడుదల కాగా, మరొకటి నెట్ ఫ్లిక్స్ లో విడుదల అయ్యాయి. ఈ రెండు సినిమాలు కూడా విమర్శకులు మరియు ప్రేక్షకుల నుండి పేలవ స్పందన లభించింది. అంతేకాక గుడ్ లక్ సఖి చిత్రం కూడా నెట్ ఫ్లిక్స్ లో ప్రీమియర్ కానున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ను మేకర్స్ ఇంకా చేయడం లేదు.
అయితే ఇప్పుడు జాతీయ అవార్డు ను గెలుపొందిన నటి మరొకసారి ఓటిటి మార్గం ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కీర్తి సురేష్ నటించిన తమిళ చిత్రం సాని కయిధమ్ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా డైరెక్ట్ వా విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం లో తమిళ ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ తోలి సారి నటించడం జరిగింది. ఈ చిత్రానికి అరుణ్ మతేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు.