‘మాహర్షి’ లేటెస్ట్ నైజాం కలెక్షన్స్ !

Published on May 20, 2019 6:28 pm IST

రిలీజ్ అయి పదకొండు రోజులు అవుతున్నా.. నైజాంలో ‘మాహర్షి’ ఇంకా మంచి కలెక్షన్స్ నే రాబడుతున్నాడు. ఇప్పటికే నైజాంలో మహర్షి బ్రేక్ ఈవెన్ అయి నాలుగు కోట్లకు పైగానే లాభాలను సాధించాడు. ఇక పదకొండు రోజు నాడు కూడా ‘మహర్షి’ నైజాంలో 1.33 కోట్ల షేర్ ను రాబట్టింది. నైజాంలో ‘మహర్షి’ మొత్తం పదకొండు రోజుల షేర్ 25.40 కోట్లుగా ఉంది.

మొత్తానికి నైజాంలో మహేశ్ మార్కెట్ రేంజ్ ‘మహర్షి’ మరోసారి గుర్తు చేశాడు. గతంలో కూడా మహేశ్ సూపర్ హిట్ చిత్రాలు నైజాంలో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించాయి. కానీ ‘మహర్షి’ వాటన్నిటినీ దాటేసింది. పైగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం కొన్ని చోట్ల నాన్ బాహుబలి రికార్డు ను కూడా బ్రేక్ చేసింది.

సంబంధిత సమాచారం :

More