అఖిల్ ‘ఏజెంట్’ టీమ్ కి నాగార్జున స్పెషల్ విషెస్

Published on Apr 28, 2023 2:13 am IST

యువ నటుడు అఖిల్ అక్కినేని లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లింగ్ మూవీ ఏజెంట్ నేడు భారీ స్థాయిలో పలు భాషల్లో ఆడియన్స్ ముందుకి రానున్న సంగతి తెల్సిందే. స్టైలిష్ సినిమాల దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుండగా దీనిని సురేందర్ 2 సినిమాస్ తో కలిసి ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర భారీ స్థాయిలో నిర్మించారు. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఏజెంట్ తప్పకుండా సక్సెస్ అవుతుందని యూనిట్ ఆశాభవం వ్యక్తం చేస్తోంది.

అయితే కొద్దిసేపటి క్రితం ఏజెంట్ టీమ్ కి కింగ్ అక్కినేని నాగార్జున ఒక నోట్ ద్వారా స్పెషల్ గా బెస్ట్ విషెస్ తెలియచేసారు. నా కుమారుడివి అలానే యంగ్ కొలీగ్ అయిన అఖిల్, నువ్వు కెరీర్ పరంగా చూసిన ఎత్తుపల్లాలు నాకు తెలుసు. ఇక ఈ సినిమా కోసం నువ్వు పడ్డ కష్టం అలానే ఆడియన్స్, ఫ్యాన్స్ కి మంచి సినిమా అందించాలని ఏజెంట్ మూవీ కోసం పడ్డ శ్రమ వృధా కాదని నా నమ్మకం. తప్పకుండా ఈ మూవీతో కెరీర్ పరంగా పెద్ద సక్సెస్ సొంతం చేసుకోవాలని, అలానే మీ టీమ్ మొత్తం పడ్డ శ్రమకు తగ్గ ఫలితం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ నాగ్ పోస్ట్ చేసిన నోట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం :