అరణ్మనై తమిళ చిత్రసీమలో ఒక హిట్ ఫ్రాంచైజీ. ఈ ఫ్రాంచైజీలోని నాల్గవ భాగం మే 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది మరియు ఈ చిత్రానికి సాలిడ్ బజ్ ఉంది. సుందర్ సి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్నా మరియు రాశి ఖన్నా కథానాయికలుగా నటించారు. తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో గ్రాండ్ గా జరిగింది. ఈ చిత్రం గురించి రాశీ ఖన్నా మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సుందర్ సి తనను పిలిచినప్పుడు స్క్రిప్ట్ వినలేదు అని, ఫ్రాంచైజీలో భాగం కావాలని కోరుకున్నట్లు తెలిపింది. రాశి ఖన్నా దక్షిణాదిలో సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తోంది. ఈ బాక్ చిత్రం పై చాలా ఆశలు పెట్టుకుంది. మరి తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.