వశిష్ట అందరినీ ఎంటర్ టైన్ చేస్తుందని ఆశిస్తున్నా – రాఘవేంద్ర రావు

Published on Jul 30, 2021 9:00 pm IST

దర్శకుడు గా ఎన్నో అద్భుత చిత్రాలను సినీ పరిశ్రమ కి అందించిన రాఘవేంద్ర రావు బీ. ఏ ఇప్పుడు నటుడు గా వెండితెర పై కనిపించనున్నారు. పెళ్లి సందడి చిత్రం తో రాఘవేంద్ర రావు గారు నటుడి గా వెండి తెర కి పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి గౌరీ రొనంకి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రం తో నటుడు గా పటిచయం అవుతున్నారు అని తెలియడం తో సినీ పరిశ్రమ కి చెందిన ప్రముఖులు, అభిమానులు, ప్రేక్షకులు రాఘవేంద్ర రావు గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

అయితే ఈ నేపథ్యం లో రాఘవేంద్ర రావు గారు స్పందించడం జరిగింది. తనకు శుభాకాంక్షలు తెలిపిన రాజమౌళి, చిరు, పవన్ కళ్యాణ్, దర్శకులకు, నటులకు, సినీ పరిశ్రమ కి చెందిన వారికి థాంక్స్ తెలిపారు. వశిష్ట పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది అంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :