“అనిమల్” సినిమా పై ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published on Mar 30, 2023 11:00 pm IST

అర్జున్ రెడ్డి చిత్రం తో ఓవర్ నైట్ సెన్సేషన్ గా మారిపోయారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఇదే చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేసి మరొక బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో రన్ బీర్ కపూర్ తో అనిమల్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం పై భారీ అంచనాలు భారీగా. రిలీజైన ఫస్ట్ లుక్ సినిమా ఎలా ఉండబోతుంది అనేది తెలిసింది. తాజాగా ఈ సెన్సేషన్ మూవీ పై సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు.

అనిమల్ సినిమా అనేది అన్ని గ్యాంగ్స్టర్ చిత్రాలకి బాప్ అవుతుంది అని అన్నారు. సందీప్ నాతో స్టొరీ డిస్కస్ చేశారు. కొన్ని సలహాలు ఇచ్చాను అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పటికే సినిమా పై మంచి హైప్ ఉండగా, ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు మరింత ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.

సంబంధిత సమాచారం :