రవితేజ ‘డిస్కో రాజా’ షూటింగ్ అప్డేట్ !

Published on Dec 2, 2018 11:43 am IST

ఇటీవల ‘అమర్ అక్బర్ ఆంటొని’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్ మహారాజ్ రవితేజ ఆ చిత్రం తో కూడా సక్సెస్ ను చూడలేక పోయాడు. ఇక ఇప్పుడు ఆయన ‘ఎక్కడికిపోతావు చిన్నవాడ’ ఫెమ్ వి ఐ ఆనంద్ దర్శకత్వంలో ‘డిస్కో రాజా’ అనే చిత్రం లో నటించనున్నాడని తెలిసిందే. ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ 13నుండి స్టార్ట్ కానుందని సమాచారం. 1980 బ్యాక్ డ్రాప్ లోసైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈచిత్రంలో ముగ్గరు హీరోయిన్లు నటించనున్నారు. దాంట్లో భాగంగా ఇప్పటికే నాబా నటేష్ , పాయల్ రాజ్ పుత్ లను ఎంపిక చేయగా ‘టాక్సీవాలా’ ఫేమ్ ప్రియాంక జవాల్కర్ ను మూడో హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారట.

తమన్ సంగీతం అందిచనున్న ఈచిత్రంలో రవి తేజ డ్యూయెల్ రోల్లో నటించనున్నారు. ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్ పతాకం ఫై రవి తాళ్లూరి ఈచిత్రాన్ని నిర్మించనున్నారు.

సంబంధిత సమాచారం :