లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు చాలా గ్యాప్ తర్వాత డైరెక్ట్ చేస్తున్న చిత్రం ‘SSR61’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. 94 ఏళ్ల వయసులోనూ సింగీతం సెట్స్‌పై చురుగ్గా పనిచేస్తుండటం చూసి సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి.
నాగ్ అశ్విన్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర యూనిట్ ఒక ప్రత్యేక బిహైండ్ ది సీన్స్ వీడియోను విడుదల చేసింది. తన గురువు లాంటి సింగీతం విజన్‌ను ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కించేందుకు నాగ్ అశ్విన్ ఎంతలా కష్టపడుతున్నాడో ఈ వీడియోలో చూడవచ్చు. ఈ సందర్భంగా సింగీతం శ్రీనివాసరావు మాట్లాడుతూ.. దశాబ్దాల కాలంగా నెరవేరని తన కలను నిజం చేస్తున్నందుకు నాగ్ అశ్విన్‌కు ధన్యవాదాలు తెలిపారు.
పక్కా రూరల్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం సింగీతం మార్క్ హాస్యంతో పాటు సరికొత్త అనుభూతిని ఇవ్వబోతోంది. త్వరలోనే ఈ చిత్ర టైటిల్ మరియు టీజర్‌ను విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. క్లాసిక్ సినిమాల మేకర్ మరియు మోడర్న్ మాస్టర్ మైండ్ కలయికలో వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
