త్వరలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా “ఉగ్రం”

Published on Sep 4, 2023 8:02 pm IST

నాంది లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అల్లరి నరేష్ మరియు విజయ్ కనకమేడల కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ఉగ్రమ్. షైన్ స్క్రీన్స్ మరియు అంజి ఇండస్ట్రీస్ బ్యానర్ లపై సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోయింది. త్వరలో జీ తెలుగు లో ఈ చిత్రం ప్రసారం కానుంది. మిర్నా మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం కి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :