దసరా నుండి విజయ్ దేవరకొండ కొత్త సినిమా !

విజయ్ దేవరకొండ నటించిన ‘టాక్సీవాలా’ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఇక షూటింగ్ దశలో ఉన్న పరుశురామ్ బుజ్జి సినిమాకు ‘గీతా గోవిందం’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. తాజాగా ఈ హీరో ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ‘నోటా’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీతో పాటు భరత్ దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యబోతున్నాడు.

తాజా సమాచారం మేరకు విజయ్ దేవరకొండ డైరెక్టర్ క్రాంతి మాధవ్ ల సినిమా దసరా (అక్టోబర్) నుండి ప్రారంభంకానుందని తెలుస్తోంది. కె.ఎస్.రామారావ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. విభిన్నమైన కథ కథనాలతో తెరకెక్కబోయే ఈ సినిమాకు సంభందించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.