ఇపుడు ఇండియన్ సినిమా నుంచి రాబోతున్న పలు అవైటెడ్ చిత్రాల్లో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కలయికలో చేస్తున్న భారీ చిత్రం ‘స్పిరిట్’ కూడా ఒకటి. ఎన్నో అంచనాలు ఉన్న ఈ సినిమా విషయంలో తారాగణం పరంగా కూడా భారీ హైప్ సెట్టయ్యింది. ఈ సినిమాని పాన్ ఇండియానే కాకుండా పాన్ ఆసియా భాషల్లో అనౌన్స్ చేయడంతో ఇదేదో ఇంటర్నేషనల్ లెవెల్ సినిమా అని ఫ్యాన్స్ అనుకున్నారు.
ఈ తర్వాత కొరియన్ సినిమా నటుడు డాన్ లీ కూడా ఈ సినిమాలో ఉన్నాడనే ప్రచారం ఓ రేంజ్ లో జరిగింది. దీనితో ఫ్యాన్స్ కూడా అతన్ని పెట్టాల్సిందే అన్నట్టు మాట్లాడుకున్నారు. అసలు దీనిపై ఓ పూర్తి క్లారిటీని దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సోదరుడు, సినిమా నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగ ఇచ్చేసారు.
డాన్ లీ ప్రెజెన్స్ విషయంలో వచ్చిన టాక్ కి ఆయన్ని కూడా పెడదామనే ప్రస్తావన అయితే వచ్చింది కానీ ఇది పక్కా హైదరాబాదీ నేపథ్యంలో నడిచే సినిమా కాబట్టి అతను సూట్ అవ్వడని డ్రాప్ అయినట్టు తెలిపారు. సో స్పిరిట్ లో డాన్ లీ లేనట్టే అని చెప్పాలి.
అయితే ఇక్కడ ఎక్కడ మిస్ లీడ్ అయ్యిందంటే ఈ సినిమాని అనౌన్స్ చేయడమే పాన్ ఇండియా భాషలతో పాటుగా జాపనీస్, చైనీస్ అలాగే కొరియన్ లో కూడా అనౌన్స్ చేశారు. దీనితో ఇదేదో ప్యాకెడ్ ఇంటర్నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్ అని ఫ్యాన్స్ అనుకున్నారు. అందుకే డాన్ లీ కూడా ఉన్నాడని బలంగా నమ్మేశారు. కానీ చివరాఖరికి అది నిజం కాదు అని తేలిపోయింది.
