లైవ్ అప్డేట్స్ : బిజినెస్ మాన్ ఆడియో విడుదల

Business Man

సినిమా స్టిల్స్

పోస్టర్స్

వర్కింగ్ స్టిల్ల్స్

వీడియోస్

 

Updated at 09:31 PM

కార్యక్రమం ముగిసింది మా ప్రత్యక్ష కథనాన్ని చదివి ఆనందించి ఉంటారని అనుకుంటున్నాం. మరిన్ని విశేషాల కోసం 123 తెలుగు.కాం బ్రౌజ్ చెయ్యండి.

Updated at 09:30 PM

ప్రిన్స్ మహేష్ బాబు మాట్లాడుతూ దూకుడు చిత్ర బృందం ఇక్కడ ఉండటం చాలా ఆనందంగా ఉందని ఇక్కడికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పూరి గారితో పని చెయ్యటం చాలా బాగుందని చిత్రాన్ని వేగంగా పూర్తి చేసారని చెప్పారు. తమన్ ఈ చిత్రానికి అద్బుతమయిన సంగీతాన్ని సమకూర్చారని చెప్పారు . కాజల్ మంచి నటి అన్నారు.ఈ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ ముగించారు.

Updated at 09:20 PM

సుధీర్ బాబు మాట్లాడుతూ " బిజినెస్ మాన్" చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు. పాటలు చాలా బాగున్నాయి అని చెప్పారు.

Updated at 09:17 PM

శ్రీను వైట్ల మాట్లాడుతూ " నాకు భారి విజయనిచ్చిన అభిమానులకి కృతజ్ఞతలు, ట్రైలర్స్ అద్బుతంగా ఉన్నాయి, "బిజినెస్ మాన్" తప్పకుండా విజయం సాదిస్తుందని కాజల్ చాలా అందంగా ఉందని ఈ చిత్రం విడుదలకై వేచి చూస్తూ ఉంటా" అని చెప్పారు.

Updated at 09:15 PM

కాజల్ మాట్లాడుతూ "ఈ చిత్రానికి సంగీతం అందించిన తమన్ గారికి అభినందనలు. మహేష్ బాబు, శ్వేతా భరద్వాజ్ మరియు పూరి ల తో కలిసి పని చేయటం చాలా సంతోషంగా ఉందని" చెప్పారు. ఈ అవకాశమిచ్చిన పూరి గారికి కృతజ్ఞతలు కూడా తెలిపారు .

Updated at 09:13 PM

ఇప్పుడు తెలుగు ఆడియో విడుదల మొదలయ్యింది, మహేష్ బాబు మరియు ఇతర అతిధులు వేదిక మీద కి చేరుకున్నారు.

Updated at 09:10 PM

పాటలతో కూడిన ట్రైలర్స్ ని వేస్తున్నారు. మహేష్ బాబు మరియు కాజల్ చూడటానికి చాలా బాగున్నారు.మహేష్ బాబు పూరి జగన్ తో కలిసి పాట పాడిన వీడియో ని కూడా ప్రదర్శించారు .

Updated at 09:02 PM

"సార్ ఒస్తారా" పాటని తమన్ మరియు సుచిత్ర లు వేదిక మీద పాడుతున్నారు అభిమానులు ఉత్సాహం తో కేరింతలు కొడుతున్నారు.

Updated at 08:27PM

శ్వేతా భరద్వాజ్ "బాడ్ బాయ్స్" పాటకి నృత్య ప్రదర్శన ఇస్తుంది

Updated at 08:25PM

బిజినెస్ మాన్ టైటిల్ ట్రాక్ ని ఇప్పుడు తమన్, రాహుల్ నంబియార్ గ్యాంగ్ వేదిక మీద ప్రదర్శన ఇస్తున్నారు

Updated at 08:22 PM

ఇప్పుడు దిల్ రాజు గారు పూరి గారిని ఇంటర్వ్యూ చేస్తున్నారు వేదిక అంతా నవ్వులతో నిండిపోయింది

Updated at 08:20 PM

ఇప్పుడు కాజల్ ని ఇంటర్వ్యూ చేస్తున్నారు, చాలా హస్యపూరిత్య్హమయిన ఇంటర్వ్యూ నడుస్తుంది అతిధులని పూరి ఆహ్లాద పరుస్తున్నారు. ఛార్మి ని కూడా ఇంటర్వ్యూ చేసారు.

Updated at 08:17 PM

పూరి గారు మహేష్ బాబుని హాస్యపూరితంగా ఇంటర్వ్యూ చేస్తున్నారు. తనని ఇంట్లో "నాని" అని పిలుస్తారని మహేష్ బాబు చెప్పారు. నమ్రత మహేష్ బాబుని "బేబీ" అని పిలుస్తారని చెప్పారు.

Updated at 08:15 PM

మన పరిశ్రమ హీరోల మీద పూరి గారు వేసిన జోక్ బాగుంది అందరిని ఉత్తేజపరిచి , నవ్వించింది .

Updated at 08:12 PM

మహేష్ బాబు , శ్రీను వైట్ల , పూరి జగన్ మరియు కొంత మంది అతిధులు వేదిక మీదకి వచ్చారు ఇప్పుడు తెలుగు లో ఆడియో విడుదల జరుగబోతుంది.

Updated at 08:12 PM

ఆర్ ఆర్ మూవీ మేకర్స్ వారి సేవ కార్యక్రమాల గురించి ఒక ప్రత్యేక క్లిప్పింగ్ వేస్తున్నారు.

Updated at 08:06PM

డా. రామానాయుడు గారు మాట్లాడుతూ " బిజినెస్ మాన్ భారి విజయం సాదించాలని కోరుకుంటున్నానని " చెప్పారు. ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ " మా ఆవిడా ఎప్పుడు చెప్తుంటుంది వేగంగా ఎలా సినిమా తీయాలో జగన్ ని చూసి నేర్చుకో అని, జగన్ గారి దగ్గర రెండు రోజులు అసిస్టెంట్ డైరెక్టర్ గా చెయ్యాలని ఉందని చెప్పారు . మహేష్ బాబు దక్షణ భారత చిత్ర పరిశ్రమ మార్కెట్ ల మొత్తం తనది చేసుకోవాలని కోరుకుంటున్నానని. ఖచ్చితంగా మహేష్ బాబు తో చిత్రం చేస్తాను " అని చెప్పారు.

Updated at 07:28PM

మలయాళం లో "సార్ ఒస్తారా" అనే పాటకి ముమ్మైత్ ఖాన్ నృత్య ప్రదర్శన ఇస్తుంది. అభిమానుల అరుపులు కేకలతో వేదిక అదిరిపోతుంది. ముమ్మైత్ ఖాన్ వేదిక మీద అందంగా కనిపిస్తుంది.

Updated at 07:25PM

రాహుల్ నంబియార్ వేదిక మీద మలయాళంలో "పిల్ల చావ్" పాట పాడుతున్నారు.

Updated at 07:23PM

వేదిక మీద కృష్ణ గారు మాట్లాడుతున్నారు. ఈ చిత్రం మూడు బాషలలో కలిపి కలక్షన్లు 150 కోట్లను దాటుతుందని చెప్పారు.

Updated at 07:18PM

మహేష్ బాబు , కృష్ణ , పూరి జగన్ , కాజల్ , తమన్ మరియు కొంత మంది అతిధులు కూడా వేదిక మీదకి చేరుకున్నారు. తమిళం లో ఆడియో విడుదల వేడుక జరుగుతుంది.

Updated at 07:12PM

కృష్ణ గారు మరియు మహేష్ బాబు ల కలయికలో ఉన్న ఒక ప్రత్యేకమయిన వీడియో ప్రదర్శించారు. ఇప్పుడే మహేష్ బాబు వేదిక దగ్గరకి వచ్చారు. వేదిక అభిమానుల అరుపులు కేరింతలతో దద్దరిల్లిపోయింది. మహేష్ బాబు తో పాటు నమ్రత కూడా వచ్చారు. మహేష్ బాబు చాలా అందంగా ఉన్నారు.

Updated 07:10 PM

ఎస్ ఎస్ రాజమౌళి ,బి వి ఎస్ ఎన్ ప్రసాద్ మరియు కొంత మంది అతిధులు వేదికను చేరుకున్నారు. మొదటగా "చందమామ" పాటను తమిళంలో విడుదల చేసారు

Updated 07:09 PM

ఎస్ ఎస్ రాజమౌళి ,బి వి ఎస్ ఎన్ ప్రసాద్ మరియు కొంత మంది అతిధులు వేదికను చేరుకున్నారు. మొదటగా "చందమామ" పాటను తమిళంలో విడుదల చేసారు

Updated 07:05 PM

బిజినెస్ మాన్ క్లిప్పింగ్స్ కి అభిమానుల అరుపులు కేకలతో వేదిక దద్దరిల్లిపోతుంది. బిజినెస్ మాన్ ట్రైలర్స్ వేస్తున్నాడు

Updated 06:50 PM

ఈ కార్యక్రమానికి సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా. ఇప్పుడే కార్యక్రమం ప్రారంభం అయ్యింది .

Updated 06:41 PM

ఇప్పుడే నాజర్ ఇక్కడికి చేరుకున్నారు. మూడు భాషల్లో ఆడియో విడుదలని ఒకేసారి చేస్తున్నారు. కావున మూడు భాషలకు సంభందించిన పాత్రికేయులు ఇక్కడికి చేరుకున్నారు

Updated 06:33 PM

తమన్ ఇప్పుడే తన స్నేహితులతో వేదికను చేరుకున్నారు. అతిధులు ఒక్కొక్కరిగా వేదికను చేరుకుంటున్నారు. కార్యక్రమం కొద్దిసేపట్లో మొదలు కాబోతుంది.

Updated 06:21 PM

ఇప్పుడే పూరి జగన్నాథ్ అభిమానుల కేరింతల మధ్య వేదిక చేరుకున్నారు.

Updated 06:00 PM

వేదిక చూడటానికి చాలా అందంగా ఉంది. ఈ లెడ్ స్క్రీన్స్ మరియు లైటింగ్ ఇక్కడ అభిమానులను ఆకట్టుకుంటోంది.ఇక్కడి వాతావరణం చాలా ఉత్సాహకరంగా ఉంది. మహేష్ బాబు బావ అయిన సంజయ్ స్వరూప్ ఇప్పుడే ఇక్కడికి చేరుకున్నారు.

Updated 05:52 PM

ఇక్కడ వేదిక నెమ్మదిగా నిండుతుంది. అభిమానులు భారిగా తరలి వచ్చారు.వేదిక బయట ఎంతో మంది అభిమానులు లోపల రావటానికి ఎదురుచూస్తున్నారు. నిర్మాతలు అచ్చి రెడ్డి మరియు సురేష్ రెడ్డి ఇప్పుడే చేరుకున్నారు. మహేష్ బాబు పాటలను ప్రదర్శిస్తున్నారు

Updated 05: 35 PM

మీకోసం బిజినెస్ మాన్ ఆడియో ఆల్బం విడుదల విశేషాలు వేదిక నుండి ప్రత్యక్షం గా అందిస్తున్నాం. ఎప్పటి కప్పుడు తాజా సమాచారం కోసం, వీనుల విందుగా సాగే కార్యక్రమ అప్డేట్స్ కోసం చూస్తూ నే ఉండండి 123 తెలుగు.కామ్

Check Out English Version Live Updates
 
రవి
Bookmark and Share