మెగాస్టార్ చిరంజీవిపై పుస్తకం విడుదల !

మెగాస్టార్ చిరంజీవిపై పుస్తకం విడుదల !

Published on Jan 18, 2017 11:12 PM IST

chiranjeevi
రెండు దశాబ్దాలుగా తెలుగు చిత్ర సీమలో అగ్ర కథానాయకుడిగా కొనసాగి, తొమ్మిదేళ్ళ విరామం తరువాత కూడా తన నెంబర్ వన్ స్థానంలో కూర్చోగలిగిన నటుడు మెగాస్టార్ చిరంజీవి. తాజాగా ఆయన నటించిన ‘ఖైదీ నెం 150’ చిత్రం కేవలం వారం రోజుల్లోనే రూ. 108 కోట్ల వసూళ్లు సాధించి చిరంజీవిపై ప్రేక్షకుల్లో అభిమానం, క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. ఈ సందర్బంగా ఆయన 35 ఏళ్ళ సినీ జీవితంపై సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు రాసిన పుస్తకం ఈరోజు విడుదలైంది. ఈ పుస్తకానికి ‘మెగా చిరంజీవితం – సినీ ప్రస్థానం 150’ అనే పేరును పెట్టారు.

ఈ పుస్తకంలో చిరంజీవి సినీ, వ్యక్తిగత జీవితంలోని ముఖ్య ఘట్టాలను, ఆసక్తికర అంశాలను, బయటి ప్రపంచానికి తెలియని ఎన్నో కోణాలను ప్రస్తావించారట రచయిత. అలాగే ఈ పుస్తకంపై పలువురు సినీ ప్రముఖులు తెలిపిన అభిప్రాయాలను కూడా ఇందులో పొందుపర్చారట. ఈ పుస్తకం ద్వారా సాధారణ వ్యక్తి కొణిదెల శివ శంకర వరప్రసాద్ స్వయం కృషితో మెగాస్టార్ చిరంజీవి స్థాయికి ఎలా ఎదిగిన విధానం సవివరంగా చెప్పబడిందట. రచయిత పసుపులేటి రామారావు గతంలో కూడా చిరంజీవి సినీ జీవితంపై ఒక పుస్తకాన్ని విడుదల చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు