ఎన్టీఆర్ డ్యాన్స్ తో మొదలుకానున్న బిగ్ బాస్ షో !


ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగు వెర్షన్ షో 16వ తేదీ సాయంత్రం నుండి మొదలుకానుంది. తమ అభిమాన హీరో ఇకపై బుల్లి తెర మీద సందడి చేయనుండటంతో ఫ్యాన్స్ అంతా షో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. షోతో పాటే స్పెషల్ ట్రీట్ అన్నట్టు ఎన్టీఆర్ ప్రారాంభోత్సవం రోజున డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నాడు.

దీని కోసం షో టీమ్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తారక్ ఈరోజు, రేపు డాన్స్ రిహార్సల్స్ చేయనున్నారు. మామూలుగానే డ్యాన్సులు అద్భుతంగా చేసే తారక్ మరి ఈ బిగ్ బాస్ షోలో ఎలాంటి ప్రదర్శన ఇస్తారో చూడాలి. ఇకపోతే ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వం వహిస్తున్న ‘జై లవ కుశ’ చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నారు.

 

Like us on Facebook