‘రుద్రమదేవి’ కోసం రీసర్చ్ చేసి సెట్స్ లోకి వెళ్ళిన రానా

‘రుద్రమదేవి’ కోసం రీసర్చ్ చేసి సెట్స్ లోకి వెళ్ళిన రానా

Published on Nov 23, 2014 8:30 PM IST

Rana_Daggubati
ఆరడుగుల పొడవుతో ఆజానుబాహుడిలా ఉండే టాలీవుడ్ యంగ్ హంక్ రానా దగ్గుబాటి ప్రస్తుతం తెలుగులో రెండు పీరియాడిక్ ఫిల్మ్స్ లో నటిస్తున్నాడు. అవే ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’. బాహుబలిని పక్కన పెడితే రుద్రమదేవి సినిమా 13వ దశాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రమదేవి జీవితకథ ఆధారంగా ఈ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో రానా చాళుక్య వీరభద్ర గా కనిపిస్తాడు.

రానా సన్నిహితులు రుద్రమదేవి కోసం రానా చేసిన విషయాలను గురించి చెబుతూ ‘ రానాకి మొదట్లో తన పాత్ర గురించి అస్సలు అవగాహన లేదు అందుకే పర్సనల్ గా నిడదవోలు వెళ్ళి అక్కడ తన పాత్ర గురించి, హిస్టరీ గురించి తెలుసుకున్నాడు. అలాగే తన పార్ట్ కి సంబందించిన డైలాగ్స్ స్క్రిప్ట్ ని వారం ముందే తెప్పించుకొని ప్రాక్టీస్ చేసేవాడు. రుద్రమదేవిని ప్రేమించే కుర్రాడిగా కనిపించే రానా ఈ సినిమాలో సుమారు 30కి పైగా డిఫరెంట్ కాన్స్త్యూమ్స్ లో కనిపిస్తాడు. ప్రతో రోజూ సెట్లో ఓ కొత్త కాస్ట్యూమ్ తో ఉండేవాడు. తన ఫిజిక్ కి తగ్గట్టు కాస్ట్యూమ్స్ చాలా బాగా డిజైన్ చేసారని’ అంటున్నారు.

రుద్రమదేవిగా అనుష్క కనిపిస్తున్న ఈ సినిమాలో గోనగన్నా రెడ్డిగా అల్లు అర్జున్ కనిపించనున్నాడు. డైరెక్టర్ గుణశేఖర్ ఎంతో రీసర్చ్ చేసి, వ్యయప్రయాసలకు ఓర్చి చేసిన ఈ సినిమాని సంక్రాంతి కానుకగా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు