ఆడియో రివ్యూ : పోటుగాడు – ఎంటర్టైనింగ్ ట్యూన్స్

ఆడియో రివ్యూ : పోటుగాడు – ఎంటర్టైనింగ్ ట్యూన్స్

Published on Aug 26, 2013 6:56 PM IST

potugadu-audio-review

మంచు మనోజ్ హీరోగా నటించిన ‘పోటుగాడు’ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమం నిన్న హైదరాబాద్ లోని 7 ఎకర్స్ లో జరిగింది. ఈ వేడుకకి టాలీవుడ్ లోని యువ హీరోలతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పవన్ వడేయర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మించారు. అచ్చు సంగీతం అందించిన ఈ ఆల్బంలో మొత్తం 5 పాటలున్నాయి. మంచు మనోజ్ ప్రతి చిఎన్మాఅలొ ఆడియో పై ఎంతో శ్రద్ధ తీసుకొని మంచి హిట్ సాంగ్స్ ఇస్తుంటాడు. మరి ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లోని పాటలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

1. పాట : ప్యార్ మే పడిపోయా

గాయనీ గాయకులు : ఇందు నాగరాజ్, మంచు మనోజ్ కుమార్

సాహిత్యం : భాషా శ్రీ
pyar-mein

‘ప్యార్ మే పడిపోయా’ పాత కాలంలో వచ్చే సాంగ్స్ స్టైల్లో ఉంటుంది. ఈ పాటని మంచు మనోజ్, ఇందు నాగరాజ్ కలిసి పాడారు. ఈ పాటకి వారిద్దరి వాయిస్ బాగా సరిపోయింది. ఈ పాటలో ఆకట్టుకునే మ్యూజిక్ ఉంది. అచ్చు ఇండియన్ – వెస్ట్రన్ వాయిద్యాలను బాగా మిక్స్ చేసి సౌండ్ ట్రాక్ ని బాగా వినసొంపుగా కొట్టాడు. భాషా శ్రీ సాహిత్యం బాగుంది. వినే కొద్దీ ఈ పాట చాలా ఆహ్లాదబరితంగా ఉంటూ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.

2. పాట : దేవత

గాయకుడు : కార్తీక్

సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
devatha-song
‘దేవత’ ఆల్బంలో ఎంతో మెలోడీగా సాగే సోలో సాంగ్. కార్తీక్ ఈ పాట విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకొని తన గాత్రంతో ఎక్కడా ఫీల్ మిస్ అవ్వకుండా పాటకి పూర్తి న్యాయం చేసాడు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం ఓ కవితా ప్రవాహంలా ఉంది. అచ్చు మ్యూజిక్ చాలా మెలోడియస్ గా ఉంది. అలాగే తన మ్యూజిక్ తో రొమాంటిక్ ఫీల్ ని కలుగజేశాడు. ఈ పాటలో వచ్చే సౌండ్స్ చెవులకు వినసొంపుగా చాలా రిఫ్రెషింగ్ గా ఉన్నాయి. ఈ ఆల్బంలో ది బెస్ట్ సాంగ్ ఇదే అని ఎలాంటి అనుమానం లేకుండా చెప్పుకోవచ్చు.

 

3. పాట : బుజ్జి పిల్ల

గాయకుడు : శింబు

సాహిత్యం : అచ్చు, మంచు మనోజ్, రామజోగయ్య శాస్త్రి, లక్ష్మీ భూపాల్, వశిష్ట శర్మ
bujji-pilla-song
‘బుజ్జి పిల్ల’ ఫాస్ట్ బీట్స్ తో పెప్పీగా సాగే మరో సోలో సాంగ్. తెలుగు – ఇంగ్లీష్ పదాలు మిక్స్ అయిన ఈ పాటని తమిళ్ హీరో శింబు మంచి జోష్ తో పాడారు. బుజ్జిపిల్ల పాటలోని సాహిత్యం ఓకే అనేలా ఉన్నా పెప్పీగా సాగే మ్యూజిక్, పాట మూడ్ కి పర్ఫెక్ట్ గా సరిపోయింది. అచ్చు ఈ పాటలో సింథసైజర్ ని బాగా ఉపయోహించాడు. మొత్తంగా ఈ పాట చాలా బాగుంది.

 

4. పాట : సూపర్ ఫిగర్

గాయనీ గాయకులు : గీత మాధురి, హేమ చంద్ర

సాహిత్యం :
మంచు మనోజ్ కుమార్
super-figure-song
‘సూపర్ ఫిగర్’ ఫాస్ట్ గా సాగే మాస్ సాంగ్, ఈ పాటని ముందు బెంచ్ వారిని దృష్టిలో పెట్టుకొని చేసారు. గీత మాధురి, హేమ చంద్ర పాటకి తగ్గట్టు తమ గాత్రాన్ని అందించారు. మంచు మనోజ్ ఈ పాటకి సాహిత్యాన్ని అందించాడు. అది మాస్ ఫీలింగ్ కలిగించేలా ఉంది. సాంగ్ మొత్తం చాలా ఫాస్ట్ గా సాగుతుంది. మ్యూజిక్ ఓకే అనేలా ఉంది.

 

 

5. పాట : బిందాస్

గాయకుడు :
టిప్పు

సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
bindas-song
ఈ ఆల్బంలో ‘బిందాస్’ మరో మాస్ సాంగ్. టిప్పు వాయిస్ పాటకి బాగా సరిపోయింది. ఈ మాస్ పాటకి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించాడు. ఈ పాటలో హీరో పాత్ర ఎలా ఉంటుంది అని చెప్పారు. పాటని బట్టి చూస్తే ఇది సినిమాలో మనోజ్ ఇంట్రడక్షన్ సాంగ్ గా చెప్పుకోవచ్చు. ఈ పాటలో కాస్త మాస్ గా ఉండే మ్యూజిక్ జస్ట్ ఓకే.

 

 

తీర్పు :

మంచు మనోజ్ ‘పోటుగాడు’ సినిమాతో అచ్చు కొన్ని ఎంటర్టైనింగ్ ట్యూన్స్ ని అందించాడు. అచ్చు మ్యూజిక్ కాస్త రిఫ్రెషింగ్ గా, కాస్త డిఫరెంట్ గా ఉంది. పెప్పీ సాంగ్స్, యూత్ ఫుల్ ట్రాక్స్ అచ్చు కంఫర్టబుల్ గా చేసాడు కానీ మాస్ ట్యూన్స్ విషయంలో మాత్రం జస్ట్ ఓకే అనిపించాడు. ఈ ‘పోటుగాడు’లో నుంచి బెస్ట్ సాంగ్స్ అంటే వరుసగా ‘దేవత’, ‘ప్యార్ మే పడిపోయా’ మరియు ‘బుజ్జి పిల్ల’ పాటలు ఉంటాయి.

రివ్యూ – మహేష్ ఎస్ కోనేరు

అనువాదం – రాఘవ

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు