సమీక్ష : నెల్లూరి పెద్దారెడ్డి – అంతగా ఇంప్రెస్ చేయలేకపోయాడు

సమీక్ష : నెల్లూరి పెద్దారెడ్డి – అంతగా ఇంప్రెస్ చేయలేకపోయాడు

Published on Mar 16, 2018 12:57 PM IST
Nelluri Pedda Reddy movie review

విడుదల తేదీ : మార్చి 16, 2018

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు : సతీష్ రెడ్డి, మౌర్యాని, ముంతాజ్

దర్శకత్వం : వి.జె.సూర్య

నిర్మాత : సి.హెచ్. రఘునాథ రెడ్డి

సంగీతం : గురురాజ్

సినిమాటోగ్రఫర్ : బాలసుబ్రహ్మణి

ఎడిటర్ : మేనగ శీను

సతీష్ రెడ్డి, మౌర్యాని, ముంతాజ్ హీరో హీరోయిన్లుగా వి.జె.సూర్య దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నెల్లూరి పెద్దారెడ్డి’. ఈరోజే ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ:

ప్రెసిడెంట్ అయిన నెల్లూరి పెద్దారెడ్డి (సతీష్ రెడ్డి) ఊళ్లోకి అందరికీ సహాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటాడు. అతని ఎదుగుదలను చూసి ఓర్వలేని కుక్కుటేశ్వర్ (ప్రభాస్ శ్రీను) ఎలాగైనా అతని పేరుని చెడగొట్టి తర్వాతి ఎన్నికల్లో తానే ప్రెసిడెంట్ గా గెలవాలని రకరకాల కుట్రలు చేస్తుంటాడు.

అదే సమయంలో పెద్దారెడ్డి కుటుంబ సమస్యలతో మనశ్శాంతి లేక భాధపడుతూ ఊరిలో ఉండే కామాక్షి (మౌర్యాని)కి దగ్గరవుతాడు. కానీ ఊరు మాత్రం వారి స్నేహాన్ని అపార్థం చేసుకుంటుంది. అలాంటి పరిస్థితుల్లో పెద్దారెడ్డి ఏం చేశాడు, అతనికున్న కుటుంబ సమస్యలేంటి, చివరికి పెద్దారెడ్డికి మనశ్శాంతి ఎలా దక్కింది అనేదే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలో ఆకట్టుకునే అంశం అంటే హీరోయిన్ కామాక్షి పాత్ర. స్వచ్ఛమైన మనసు, మంచితనం, విశ్వాసం కలిగిన గూడెం అమ్మాయిగా నటి మౌర్యాని మెప్పించింది. ఇక కథకు ప్రధానమైన పెద్దారెడ్డి పాత్రను కొంతవరకు బాగానే డిజైన్ చేశారు. అప్పటి వరకు రెడ్డిగారిది ప్రశాంతమైన జీవితం అనుకుంటుండగా అతని జీవితంలో కూడ కష్టాలు ఉన్నాయని చూపడంతో సినిమాపై కొంత ఆసక్తి కలిగింది.

అలాగే హీరోయిన్ హీరో కోసం త్యాగం చేయడం, ఆ త్యాగం వెనుక ఉన్న బలమైన కారణం సినిమా చివర్లో కొంత పట్టు పెంచాయి. పెద్దారెడ్డికి, అతని భార్యకు మధ్యన జరిగే సంఘర్షణ తాలూకు సన్నివేశాల్ని కొంత బాగానే చూపించారు.

మైనస్ పాయింట్స్ :

సినిమాలో సరైన కథంటూ ఉండదు. ఎప్పుడో పాత కాలంనాటి కథ కావడంతో సినిమా పెద్దగా కట్టుకోలేకపోయింది. ఇక దర్శకుడు వి.జె.సూర్య అయితే పెద్దారెడ్డి పాత్రను గొప్పగా చిత్రించేందుకు ప్రతి 10 నిముషాలకు ఒకసారి హీరోకి ఎలివేషన్ ఇవ్వడం విసిగించింది. కొన్ని సన్నివేశాలైతే మరీ సిల్లీగా అనిపిస్తాయి. ఇక కామెడీని పండించాలని ఉద్దేశ్యంతో కొంతమంది ప్యాడింగ్ ఆర్టిస్టులను తీసుకుని చేసియాన్ ప్రయత్నం బెడిసికొట్టింది.

ఒకే తరహా సన్నివేశాలు మళ్ళీ మళ్ళీ వస్తూ విసిగించాయి. వాటికి తోడు కొన్ని పాత్రలకు అందులోని నటులు అస్సలు సెట్టవ్వలేదు. వారి ఓవర్ పెర్ఫార్మెన్స్ చిరాకు పుట్టించింది. ఎడిటర్ల చాలా సన్నివేశాలని సరిగా కట్ చేయకపోవడంతో హీరో సతీష్ రెడ్డి కెమెరా ముందు చాలా చోట్ల తడబడుతున్నట్లు అనిపించింది. ఇక సినిమాలోని పాటలన్నీ ఒకే ట్యూన్ తో సాగుతూ వినలేని విధంగా ఉన్నాయి.

దర్శకుడు సూర్య పల్లెటూరి పాత్రల్ని, వ్యక్తిత్వాల్ని తెరపై పండించాలనే ఉద్దేశ్యంతో క్రియేట్ చేసిన పాత్రలు, వాటి తాలూకు సన్నివేశాలు మోతాదుకు మించి ఉండటంతో ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టినట్లైంది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు సూర్య పాత ఫార్ములా కథను తీసుకుని దానికి ఏమాత్రం ఆకట్టుకోలేని కథనాన్ని రాసుకుని అందులో ప్రధానమైన రెండు పాత్రలు మినహా మిగతా అన్నిటినీ పేలవంగా రాసుకుని, బలం లేని సన్నివేశాలతో చేసిన ఈ చిత్రం ఎక్కడా ఇంప్రెస్ చేయలేకపోయింది.

సంగీత దర్శకుడు గురురాజ్ సంగీతం ఎక్కడా ఆకట్టుకోలేదు. బాలసుబ్రహ్మణి సినిమాటోగ్రఫీ ఏంటా గొప్పగా లేదు. మేనగ శీను ఎడిటింగ్ కూడ సరిగాలేదు. నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు మరీ తక్కువ స్థాయిలో ఉన్నాయి.

తీర్పు :

ఈ వారం ప్రేక్షకుల్ని విసిగించడానికి వచ్చిన సినిమాల్లో ‘నెల్లూరి పెద్దారెడ్డి’ కూడ ఒకటి. దర్శకుడు వి.జె. సూర్య తీసుకున్న పేలవమైన కథ, కథనాలు, విసిగించే సన్నివేశాలు, నటీ నటుల పెర్ఫార్మెన్స్ ఇందులో ఇబ్బంది కలిగించే అంశాలు కాగా ప్రేక్షకుడ్ని సంతృప్తిపరచే కంటెంట్ కొద్ది మొత్తంలో కూడ లేకపోవడం నిరుత్సాహపరిచే అంశం. మొత్తం మీద చెప్పాలంటే ఈ చిత్రం ప్రేక్షకుల్ని పెద్దగా ఇంప్రెస్ చేయదు.

123telugu.com Rating : 2/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు