సమీక్ష : పాకశాల – థ్రిల్లర్, కానీ థ్రిల్స్ లేవు!!

సమీక్ష : పాకశాల – థ్రిల్లర్, కానీ థ్రిల్స్ లేవు!!

Published on Jan 9, 2016 6:15 PM IST
Paakashala review

విడుదల తేదీ : 08 జనవరి 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

దర్శకత్వం : ఫణికృష్ణ సిరికి

నిర్మాత : రాజ్ కిరణ్ – ఆర్.పి రావు

సంగీతం : శ్రవణ్ ఎస్ మిక్

నటీనటులు : విశ్వ, శ్రీనివాస్, కీర్తి, అర్పిత..

నూతన నటీనటులైన విశ్వ, శ్రీనివాస్, కీర్తి, అర్పిత, జదీష్ రెడ్డిలను పరిచయం చేస్తూ ఫణికృష్ణ అనే కొత్త డైరెక్టర్ చేసిన ప్రయత్నమే ‘పాకశాల’. వంట అనేదానికి మూలం అయిన వంటశాల అలియాస్ పాకశాల అనే టైటిల్ ని పెట్టుకొని రొటీన్ కి భిన్నంగా తెరకెక్కించిన థ్రిల్లర్ సినిమానే ఇది. మరి డైరెక్టర్ ఫణికృష్ణ ఈ పాకశాలలో ఏం వండాడు, ఆ వండిన సినిమా అనే వంటకం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ :

మరి కొద్ది రోజుల్లో రిటైర్ అయిపోయే పోలీస్ ఆఫీసర్.. తన రిటైర్ మెంట్ లోపు ఉన్న పెండింగ్ కేసులన్నిటినీ ఫినిష్ చేయాలనుకుంటాడు.. అనుకున్నదాని ప్రకారమే ఒక్క కేసు తప్ప మిగతా అన్నీ ఫినిష్ చేస్తాడు. దాన్ని కూడా ఫినిష్ చేయాలని తన సబార్డినేట్ అయిన విక్రమ్ కి ఆ కేసుని అప్పగిస్తాడు. ఆ టైంకి సస్పెన్షన్ లో ఉన్న విక్రమ్ తన ఓన్ స్టైల్ లో కేసుని డీల్ చేయడం మొదలు పెడతాడు. అలా ఆ కేసుకి కారణమైన అమ్మాయితో మాట్లాడుతుండగా తననే షాక్ చేసేలా ఓ నిజం తెలుస్తుంది.

ఆ నిజమే.. తను డీల్ చేస్తున్న కేసుకి తనకి పరోక్షంగా సంబంధం ఉండడం. ఇంతకీ విక్రమ్ డీల్ చేసిన కేసు ఏంటి? ఆ కేసుకి విక్రమ్ కి పరోక్షంగా ఉన్న లింక్ ఏమిటి? ఫైనల్ గా ఈ కేసుని విక్రమ్ ఏ మేరకు సాల్వ్ చేయగలిగాడు అన్నది మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్ :

పాకశాల అనే సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఫస్ట్ హాఫ్ ని చాలా ఆసక్తికరంగా తీయడం. చెప్పాలంటే ఈ సినిమాని నరమాంస భక్షకురాలైన ఓ అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఈ కాన్సెప్ట్ టాలీవుడ్ కి చాలా కొత్తది అయినా దానిని ఆసక్తికరంగా చెప్పడంలో కొంతవరకూ సక్సెస్ అయ్యాడు. ఇక సినిమా పరంగా చూసుకుంటే.. ఫస్ట్ హాఫ్ లో చాలా కామెడీ సీన్స్ ప్రేక్షకులను నవ్విస్తాయి. అలాగే ఇంటర్వల్ బ్లాక్ దగ్గర వచ్చే అసలైన ట్విస్ట్ బాగుంది.

నరమాంస భక్షకురాలైన దేవిక పాత్రలో కీర్తి చౌదరి చాలా బాగా చేసింది. చిన్న పాత్ర కానీ సినిమాకి చాలా కీలకం అలాంటి పాత్రలో అర్పిత బాగా చేసింది. ఈ ఇద్దరు సినిమాని తమ భుజాలపై వేసుకొని నడిపించారు. ఇక పోలీస్ ఆఫీసర్ గా చేసిన విక్రమ్ మంచి నటనని కనబరిస్తే.. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.

మైనస్ పాయింట్స్ :

కథలో ట్విస్ట్ లు పరవాలేధనిపించినా కథని చెప్పిన విధానం మాత్రం చాలా ఊహాజనితంగా సాగడం బోరింగ్ గా అనిపిస్తుంది. ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ సెకండాఫ్.. ఇంటర్వల్ ట్విస్ట్ తర్వాత కథని అస్సలు ఆసక్తికరంగా నడిపించలేదు. కథలో పెద్ద ట్విస్ట్ లు లేకపోయినా కథనంలో అయినా సస్పెన్స్ ని క్రియేట్ చేయాల్సింది. కానీ కథనం ఊహాజనితంగా తయారవ్వడం, నేరేషన్ చాలా స్లోగా అనిపించడం వలన సెకండాఫ్ చాలా బోరింగ్ గా ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని ఇంకా బెటర్ గా రాసుకొని ఉండాల్సింది.

ఇక సినిమాలో మెయిన్ రోల్స్ చేసిన వారిలో తెలిసిన నటీనటులు ఒక్కరు కూడా లేకపోవడం వలన ఆడియన్స్ సినిమాకి కనెక్ట్ అవ్వడానికి కాస్త సమయం పడుతుంది. సినిమాలో రెండు పాటలే ఉన్నాయి, అది కూడా ఒకటి ఫస్ట్ హాఫ్ లో వస్తే మరొకటి సెకండాఫ్ లో వస్తుంది. అయినా కానీ ఆ రెండు పాటలు సినిమా ఫ్లోని మరింత దెబ్బ తీస్తాయి. ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుండాలి. కానీ ఈ సినిమా నేపధ్య సంగీతం బాగుండక పోవడమే కాకుండా ప్రేక్షకులకు ఇర్రిటేషణ్ తెప్పిస్తుంది.

సాంకేతిక విభాగం :

సినిమాటోగ్రఫీ చెప్పుకునే స్థాయిలో లేదు.. సినిమా మొత్తం చాలా లో లైటింగ్ లో ఉంటుంది. కొన్ని సీన్స్ కి ఈ ఎఫెక్ట్స్ అవసరమే కానీ సినిమా మొత్తానికి అయితే అవసరం లేదు. మ్యూజిక్ అనేది టెక్నికల్ డిపార్ట్ మెంట్ లో మేజర్ మైనస్. ఫస్ట్ హాఫ్ పరంగా ఎడిటింగ్ బాగా అనిపించినా సెకండాఫ్ మాత్రం బాలేదు. సెకండాఫ్ లో చాలా సీన్స్ ని కత్తిరించి ఉండాల్సింది. నిర్మాణ విలువలు కూడా బిలో యావరేజ్ అనేలా ఉన్నాయి.

డైరెక్టర్ ఫణి కృష్ణ తన మొదటి సినిమాకి కొత్త కాన్సెప్ట్ ఎంచుకున్నాడు, బాగానే ఉంది కానీ ఎంత కొత్త కాన్సెప్ట్ ఎందుకున్నాడో అంటే కొత్తగా సినిమాని కూడా చెప్పగలిగి ఉంటే బాగుండేది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే విషయంలో స్పెషల్ కేర్ తీసుకోవాల్సింది. అలాగే కథలో ఇనొన్ని థ్రిల్స్ రాసుకోవాల్సింది. డైరెక్టర్ గా కూడా జస్ట్ ఓకే అనిపించుకున్నాడు.

తీర్పు :

చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన పాకశాల మూవీ మీ ఊహలకి మించకుండా సాగే థ్రిల్లర్. కొన్ని కామెడీ సీన్స్ మరియు ఒకటి రెండు థ్రిల్స్ తప్ప సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేవు. సినిమాలో మెయిన్ రోల్స్ చేసిన కీర్తి, అర్పితల పెర్ఫార్మన్స్ సినిమాని కూసింత సేవ చేసింది. స్క్రీన్ ప్లే మరియు స్లో నేరేషన్ వలన సినిమా బాగా సాగదీసినట్టు ఉండడం అనేది పాకశాలకి మెయిన్ మైనస్. ఈ సినిమాని మీరు థియేటర్ లో స్కిప్ చేసి టెలివిజన్ లో వచ్చేంత వరకూ వేచి చూడండి.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు