యంగ్ హీరో నాని ద్విపాత్రాభినయంలో అమలా పాల్, రాగిణి ద్వివేది హీరోయిన్స్ గా నటించిన సినిమా ‘జెండాపై కపిరాజు’. చాలా కాలంగా ఈ సినిమాకి రిలీజ్ డెట్లు అనౌన్స్ చెయ్యడం, అవేమో వాయిదా పడడం కామన్ గా జరుగుతోంది. ప్రస్తుతానికి సైలెంట్ గా ఉన్న జెండాపై కపిరాజు టీం మళ్ళీ ఓ కొత్త రిలీజ్ డేట్ తో మీడియా ముందుకు రానుంది. ఈ రోజు సాయంత్రం ఈ సినిమాకి సంబందించిన కొత్త టీజర్, కొత్త రిలీజ్ డేట్ ని విడుదల చేయనున్నారు.
సముద్ర ఖని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నాని చేస్తున్న రెండవ పాత్ర పేరు మయ కన్నన్. ఈ పాత్రకి సంబందించిన లుక్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాలో శరత్ కుమార్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు.
