తమిళ చిత్ర పరిశ్రమ సంచలన నిర్ణయం.. స్టార్స్ ఒప్పుకుంటారా ?

భారీ బడ్జెట్‌తో రూపొందించే చిత్రాల నిర్మాణం పై చాలా రోజులుగా తమిళ సినిమా ఇండస్ట్రీలో చర్చ నడుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా తమిళ చిత్ర నిర్మాతల మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. భారీ బడ్జెట్‌లో రూపొందించే చిత్రాల్లో నటించే స్టార్ హీరోలు తమ పారితోషికాలను రెవెన్యూ షేరింగ్‌ మోడల్‌లో తీసుకుంటే ఇండస్ట్రీకి మేలు జరుగుతుందని తమిళ చిత్ర నిర్మాతల మండలి ఈ నిర్ణయం తీసుకుంది. ఐతే, రెవెన్యూ షేరింగ్‌ మోడల్‌ ను టీఎఫ్‌పీసీ ప్రతిపాదించడం ఇదే మొదటిసారి కాదు.

గత ఏడాదిలోనూ ఇదే నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ నిర్ణయం అమలు కాలేదు. అలాగే థియేట్రికల్ రన్‌ పూర్తయిన తర్వాత సినిమాలను ఓటీటీలో విడుదల చేసే విషయంలో కూడా కౌన్సిల్‌ మరో తీర్మానం చేసింది. తాజాగా తీసుకున్న నిర్ణయంతో.. సినిమా విడుదలైన 6 నుంచి 8 వారాల పాటు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు తీసుకురావడానికి వీల్లేదని నిర్ణయించింది. ముఖ్యంగా భారీ బడ్జెట్‌ చిత్రాలు కచ్చితంగా 8 వారాలు ఆగాల్సిందే అని కఠిన నిర్ణయం తీసుకున్నారు.

Exit mobile version