‘దళపతి’ కోసం మణిరత్నంని ఇమిటేట్ చేసాను – రజినీకాంత్

rajinikanth
పంచ్ డైలాగ్స్, యాక్టింగ్ లో స్టైల్, పర్ఫెక్షన్ కి మారు పేరు ఎవరు అంటే ఆలోచించకుండా చెప్పే పేరు సూపర్ స్టార్ రజినీకాంత్. రజినీ నటించిన గ్రాఫికల్ మానియా ‘కొచ్చాడియాన్’ మే లో ప్రేక్షకుల ముందుకు రానుంది. నిన్న తమిళనాడు నూతన సంవత్సరాన్ని పురష్కరించుకొని రజినీ కాంత్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్లో బాగా కష్టపడి చేసిన సినిమా ఏదని అడిగితే దానికి ఆయన ఇచ్చిన సమాధానం మణిరత్నంతో చేసిన ‘దళపతి’.

‘దళపతి’ కోసం రజినీ ఏ విషయంలో కష్టపడ్డాడు అనేది ఆయన మాటల్లోనే ‘ మణిరత్నం దళపతి చేస్తున్నప్పుడు నా కెరీర్లో చాలా కష్టం అనిపించింది. ఎందుకంటే అతని ఫిల్మ్ మేకింక్ అంతా డిఫరెంట్ గా ఉంటుంది. ఒక యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు ఫేస్ లో ఎమోషన్స్ కూడా చూపించాలి అన్నాడు. ఒక ఫైట్ సీక్వెన్స్ లో ఎమోషన్స్ చూపించాల్సిన అవసరం ఏముంది అని వండర్ గా ఫీలయ్యాను. ఒక 6 రోజుల తర్వాత నా అంతట నేను చేయకుండా మణిరత్నంని చేసి చూపించమన్నాను. ఆ తర్వాత నేను అతను చేసిన దాన్ని ఇమిటేట్ చేసాను. ఆ సినిమా పరంగా నేను అందుకున్న క్రెడిట్ మొత్తం మణిరత్నంకే చెందుతుందని’ రజినీ అన్నాడు.

‘కొచ్చాడియాన్’ రిలీజ్ తర్వాత రజినీకాంత్ కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో నటించనున్నాడు. అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా కనిపించనున్నారు.

Exit mobile version