
బక్క పలచగా ఉండే కామెడీ కింగ్ అల్లరి నరేష్ ఒక్కసారిగా 228 కేజీల బరువు ఉంటే ఎలా ఉంటాడో ఊహించుకోండి. మన ఊహకి తగ్గట్టుగానే అల్లరి నరేష్ 228 కేజీలు ఉన్న వ్యక్తిగా మేకప్ వేసుకొని ఎంతో కష్టపడి చేసిన సినిమా ‘లడ్డూబాబు’. ఇంత బరువు ఎవరన్నా ఉంటే అతని పరిస్థితి ఏమిటి? అతనికి ప్రేమ అనేది పుడితే, ఆ ప్రేమని ఎలా దక్కించుకున్నాడు? అనే కథాంశం చుట్టూ తిరిగే కథే ‘లడ్డూబాబు’.
ఏప్రిల్ 18న ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అంతటా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని జీ తెలుగు వారు భారీ మొత్తానికి సొంతం చేసుకున్నారు. సుమారు 3.25 కోట్లకి శాటిలైట్ రైట్స్ అమ్ముడు పోయాయి. చిన్న సినిమాగా లో బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి ఈ రేంజ్ లో శాటిలైట్ రైట్స్ అమ్ముడు పోవడంతో నిర్మాతలు చాలా హ్యాపీ గా ఉన్నారు.
విభిన్న చిత్రాల దర్శకుడు రవిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూర్ణ, భూమిక హీరోయిన్స్ గా నటించారు. చక్రి సంగీతం అందించాడు.