రజినిని ఆకాశానికి ఎత్తేసిన సోనాక్షి

Sonakshi-Sinha-is-all-prais
రజినికాంత్ తో నటించిన ఏ ఒక్కరూ ఆయన సింప్లిసిటీని మెచ్చుకోకుండా వుండలేరు. రజిని తన స్టార్ పవర్ ని పక్కనపెట్టి మరీ ఆయనతో నటించే వారితో చాలా సఖ్యతగా వుంటాడు మన సూపర్ స్టార్. ఇప్పుడు బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా కూడా చేరింది

వరుసపెట్టి బాలీవుడ్ ఆఫర్లు వస్తున్న తరుణంలో సోనాక్షి సిన్హా రజిని సరసన సౌత్ లో నటించడానికి సిద్ధపడింది. మైసూరులో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. మొదటి షెడ్యూల్ లో కేవలం ఒకే వారం రజిని సరసన నటించిన సోనాక్షి ఆయనను పొగిడే పనిపెట్టుకుంది. “నా మొదటి తమిళ సినిమా లింగా లో మొదటి రోజు షూటింగ్ ముగిసింది. చిత్రబృందమంతా నాకు చాలా నచ్చింది. ఇంటి వాతావరణాన్ని తలపించింది” అని చెప్పుకొచ్చింది

ఈ సినిమాలో అనుష్క మరో హీరోయిన్. జగపతిబాబు ముఖ్యపాత్రధారి. కె.ఎస్ రవికుమార్ దర్శకుడు. రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత

Exit mobile version