రీసెంట్ గా టాలీవుడ్ నుంచి వచ్చిన పలు క్లీన్ హిట్ చిన్న చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సంగీత్ శోభన్ హీరోగా నయన్ సారిక హీరోయిన్ గా దర్శకురాలు మానస శర్మ తెరకెక్కించిన కామెడీ ఫాంటసీ థ్రిల్లర్ చిత్రం రాకాస కూడా ఒకటి. డీసెంట్ బజ్ నడుమ విడుదల అయ్యిన ఈ సినిమా థియేటర్స్ లో మంచి వసూళ్లు సాధించి నిర్మాత నిహారిక కొణిదెల బ్యానర్ లో మరో హిట్ గా నిలిచింది.
ఇక థియేటర్స్ లో రన్ ని దాదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమా నెక్స్ట్ ఓటిటి రిలీజ్ కి సిద్ధం అయినట్టు బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం రాకాస ఈ మే 1 నుంచే ఓటిటిలో సందడి చేయనున్నట్టుగా టాక్. దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాని సొంతం చేసుకోగా అందులో మే 1 నుంచి పాన్ ఇండియా భాషల్లో ఈ సినిమాని వారు తెస్తున్నట్టు తెలుస్తుంది. ఇక దీనిపై అధికారిక క్లారిటీ కూడా త్వరలోనే రానుంది. ఇక ఈ సినిమాకి అనుదీప్ దేవ్ సంగీతం అందించగా వెన్నెల కిషోర్, తనికెళ్ళ భరణి, బ్రహ్మాజీ, గెటప్ శ్రీను తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
