సాయిబాబా ఆశీస్సులు తీసుకున్న నాగార్జునన ఫ్యామిలీ

Nagarjuna-Family-visits-Sai
చాలా మంది తారలు తమ సినిమాల రిలీజ్ కి ముందు వారికి విజయం దైవ దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. మే 22, 23 తేదీలు కూడా అక్కినేని ఫ్యామిలీకి చాలా ముఖ్యమైన రోజులు. ఇది ఇండస్ట్రీలో కామన్ గా జరిగే విషయమే.. తాజాగా అక్కినెఇ ఫ్యామిలీ కూడా ఇదే పని చేసారు. ఎందుకంటే లేజండ్రీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి సినిమా ‘మనం’ మే 23న విడుదల కానుంది.

కానీ అభిమానుల కోరిక మేరకు మే 22న హైదరాబాద్, ఓవర్సీస్ లో ప్రీమియర్ షోస్ వేస్తున్నారు. ఈ సందర్భంగా అక్కినేని కుటుంబ సభ్యులైన నాగార్జున, అమల, నాగ చైతన్య, అఖిల్ కలిసి ఈ రోజు ఉదయం పంజాగుట్టలోని సాయిబాబా గుడిని దర్శించుకొని సాయిబాబా ఆశీస్సులు తీసుకున్నారు. నాగార్జున, అతని ఫ్యామిలీ సినిమా మంచి విజయం అందుకుంటుందని చాలా నమ్మకంగా ఉన్నారని తెలుస్తోంది.

విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎఎన్ఆర్ తో పాటు నాగార్జున, నాగ చైతన్య కూడా నటించారు. సమంత, శ్రియ సరన్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు.

Exit mobile version