
ప్రస్తుతం టాలీవుడ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మల్టీ స్టారర్ సినిమా వెంకటేష్, పవన్ కళ్యాణ్ లు కలిసి నటిస్తున్న హిందీ ‘ఓ మై గాడ్’ రీమేక్. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు ‘గోపాలా గోపాలా’ అనే టైటిల్ ను పర్శీలిస్తున్నారని తెలుస్తోంది. కానీ దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటణ మాత్రం వెలువడలేదు. ఈ సినిమా టైటిల్ కి సంబంధించి మరిన్ని ఉహాగానాలు సినీ వర్గాలలో తీరుగుతున్నాయి.
ఈ సినిమాలో వెంకటేష్ సరసన శ్రీయ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫి అందించగా, అనూప్ రుబెన్స్ సంగీతం సమకూరుస్తున్నాడు. ‘తడాకా’ సినిమాను డైరెక్ట్ చేసిన డాలీ, ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.