యువరాణిగా మారనున్న శ్రీదేవి

sridevi
అతిలోకసుందరి శ్రీదేవి “ఇంగ్లీష్ విన్గ్లిష్” చిత్రం తో ఘనవిజయం సాధించి తన రెండో ఇన్నింగ్స్ను మొదలుపెట్టింది.ఈ చిత్రం తరువాత శ్రీదేవికి పెద్ద సంఖ్యలో అవకాశాలు వెల్లువెత్తాయి.కానీ ఆమె వేటినీ అంగీకరించలేదు.

అయితే మొత్తానికి ఆమె తమిళ సూపర్ స్టార్లు అయిన సుదీప్,విజయ్ ల చిత్రంలో నటించడానికి అంగీకరించింది.ఎన్నో పెద్ద పెద్ద బాలీవుడ్ చిత్రాలను వదిలేసి ఒక తమిళ చిత్రాన్ని ఒప్పుకోవడం తో ఈ వార్త సంచలనం సృష్టించింది.

ఇటీవల అందిన సమాచారం ప్రకారం ఈ సాహస చిత్రంలో శ్రీదేవి యువరాణి పాత్ర పోషించనున్నది,ఈ చిత్రంలో వీరితో పాటు ఇంకా చాలామంది స్టార్లు నటించబోతున్నారట.

చింబుదేవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ 2014 ద్వితీయభాగంలో ప్రారంభం కానుంది.

Exit mobile version