
ఒక మంచి హిట్ చిత్రం ఇచ్చిన హీరో తో కలసి పనిచేయాలని ఎవరికి మాత్రం ఉండదు? సందీప్ కిషన్ రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’ తో మంచి కమర్షియల్ హిట్ ని అందించిన ఆనంది ఆర్ట్స్ విజయాల బాటలో కొనసాగుతుంది. ప్రస్తుతం సందీప్ హీరోగా రెండో ప్రొజెక్ట్ ని ప్రారంభించింది. ఈ చిత్రంలో ఒక ఢిల్లీ అమ్మాయి హీరోయిన్ గా నటించనుంది. తెలుగు చిత్రం లో నటించడానికి ఎంతగానో ఎదురుచూస్తున్న ఈమె ఇటివలే ‘ఇవన్ వెర మతిరి’ (తెలుగు లో ‘సిటిజెన్’ ) అనే తమిళ చిత్రంలో నటించింది.
హైదరాబాద్ నే ఇల్లుగా మార్చుకున్న దర్శకుడు కన్మణి (‘నా ఉపిరి ఫేం’) ఈ చిత్రం కోసం మెగాఫోన్ పట్టుకోనున్నారు. ఈ చిత్రం చిత్రీకరణ తో పాటు పాత్రల ఎంపికలో తన తమిళ తరహా మార్చుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. అలానే ఈ కంప్లీట్ ఎంటర్టైనర్ పై ఎంతో నమ్మకం గా వున్నాడు. “పది రోజుల క్రితం షూటింగ్ ప్రారంభించం. మాకు కేవలం గ్లామరస్ హీరోయిన్ మాత్రమే కాదు మంచి నటి కూడా కావలి అందుకే సురభి ని ఈ చిత్రం కోసం తీసుకున్నారు. మేము సౌందర్య లాంటి నటి కోసం వెతికం. సురభి కి అందమైన కనులు సాంప్రదాయమైన మొహం వున్నాయి. ఈ పాత్రకి ఎంతో చక్కగా సరిపోతుంది. సందీప్ కిషన్ కి కూడా ఈ పాత్ర ఎంతో చక్కగా సరిపోతుంది. ఇంకా ఈ చిత్రానికి పేరు అనుకోలేదు కాని త్వరలో విజయవాడ లో కొంత షూటింగ్ చెయ్యనున్నాం. చాలా రోజులు ఎదురుచూస్తున్న నాకు హిట్ ఇవ్వాల్సిన సమయం వచ్చింది.” అని కల్మణి అన్నారు.