గతంలో అందాల భామ రంభ తెలుగు తమిళ భాషల్లో టాప్ హీరోయిన్ గా వెలుగొందింది. రంభ టాప్ హీరోయిన్ గా ఉన్న రోజుల్లో ఆమెకి ఇచ్చిన ఓ ఓల్డ్ గిఫ్ట్ ఇప్పుడు తనని కష్టాల్లోకి నెట్టింది. ప్రస్తుతం రంభ – తమిళ ఫేమస్ కమెడియన్ గౌందర్ మని ఫ్యామిలీ మధ్య కోర్టు కేసు నడుస్తోంది.
అసలు విషయంలోకి వెళితే గౌందర్ మని 1990లలో రంభకి ఓ హౌస్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రేట్స్ భారీగా పెరగడం వల్ల ఆ ఇంటి వేల కోట్లకి పెరిగిపోవడంతో అసలు సమస్య మొదలైంది.
తమ ప్రాపర్టీని తమకు తిరిగి ఇచ్చేయాలని గౌందర్ మని ఫ్యామిలీ రంభపై కేసు పెట్టారు. రంభ కూడా తనకు గిఫ్ట్ గా ఇచ్చినది తనకే సొంతం అవుతుందని కోర్టులో పిటీషన్ వేసింది. ప్రస్తుతం ఇద్దరూ తమకే చెందుతుందంటే తమకే చెందుతుందని లీగల్ గా వాదనకు దిగారు. చివరికి ఈ ప్రాపర్టీ ఎవరికీ చెందుతుందా అనేది చూడాలి..
