ఎన్.టి.ఆర్ తో జతకట్టనున్న సమంత

NTR-and-Samantha
సమంత త్వరలో ఒక మల్టీ స్టారర్ సినిమాలో నటించనుంది అని మేము ఇప్పటికే తెలిపాం. ఆ ప్రాజెక్ట్ వివరాలు పూర్తిగా తెలియకపోయినా కొంతమేరకు సమాచారం బయటపడింది. సమాచారం ప్రకారం ‘బృందావనం’, ‘రామయ్యా వస్తావయ్యా’ మరియు ‘రభస’ సినిమాల తరువాత మరోసారి ఎన్.టి.ఆర్ తో కలిసి నటించనుంది

అక్కినేని నాగార్జున మరియు ఎన్.టి.ఆర్ ఈ మల్టీ స్టారర్ సినిమాలో నటిస్తున్నారు. పి.వి.పి తీస్తున్న ఈ సినిమాకోసం సమంతని సంప్రదించారట. ఇంకా ఎటువంటి ప్రకటన అధికారికంగా వెలువడలేదు

నాగార్జున సరసన నటించడానికి ఒక సీనియర్ నటిని సంప్రదించారట. మరిన్ని వివరాల కోసం మా సైట్ ని చూస్తూ వుండండి

Exit mobile version