టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎవరు అంటే అందరూ ముక్త కంఠంతో చెప్పే పేరు ఎస్ఎస్ రాజమౌళి. సినిమా సినిమాకి తన సినిమాలతో తెలుగు సినిమా స్టాండర్డ్స్ ని పెంచుతున్న డైరెక్టర్ రాజమౌళి. తాజాగా రాజమౌళి రికార్డ్ ని సొంతం చేసుకున్నాడు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా రాజమౌళి తన సినిమా విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్ నెట్వర్క్స్ ద్వారా తన అభిమానులతో పంచుకుంటూనే ఉంటాడు.
తాజాగా ఆయన ఫేస్ బుక్ లైక్స్ 2 మిలియన్ లైక్స్ ని క్రాస్ చేసింది. ఇప్పటి వరకూ ఇండియాలోనే ఏ డైరెక్టర్ కి ఇంత మంది ఫాలోవర్స్ లేకపోవడంతో ఫేస్ బుక్ లో ఇండియా టాప్ డైరెక్టర్ గా రికార్డ్ సృష్టించాడు. ఈ సందర్భంగా రాజమౌళి తన ఫాలోవర్స్ అందరికీ థాంక్స్ చెప్పారు. రాజమౌళి ప్రస్తుతం అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ‘బాహుబలి’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.
ఈ సినిమా తాజా షెడ్యూల్ ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన ఓ ప్రత్యేక సెట్లో ప్రారంభమైంది. ప్రభాస్, తమన్నా, ప్రముఖ నటీనటులు ఈ షూటింగ్ లో పాల్గొననున్నారు
