
గత కొద్ది రోజుల క్రితం ప్రముఖ నిర్మాతలైన పివిపి మరియు దిల్ రాజు కలిసి ఓ మళయాళ సినిమాని తెలుగులో రీమేక్ చేయనున్నారని, అందులో ముగ్గురు హీరోలు ఉంటారని తెలిపాము. ఆ సినిమానే ‘బెంగుళూరు డేస్’. మలయాళంలో ఇటీవలే విడుదలై సూపర్ హిట్ అయ్యింది.
ఈ రీమేక్ సినిమా ద్వారా ‘బొమ్మరిల్లు’, ‘పరుగు’ సినిమాలతో సక్సెస్ అందుకొని ఆ తర్వాత ‘ఒంగోలు గిత్త’ సినిమాతో ఫ్లాప్ కావడంతో ఒక సంవత్సరంపై నుంచి ఎవరికీ కనపడకుండా పోయిన బొమ్మరిల్లు భాస్కర్ మళ్ళీ వెలుగులోకి వచ్చాడు. ఈ రీమేక్ సినిమాకి బొమ్మరిల్లు భాస్కర్ ని డైరెక్టర్ గా తీసుకోవాలని ఈ చిత్ర ప్రొడక్షన్ టీం అనుకుంటున్నట్లు సమాచారం. కానీ ఈ విషయం పై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా తెలిసే అవకాశం ఉంది.